శ్రియకి అవ‌కాశాలు త‌గ్గాయి

Offers dry for Shriya Saran
Sunday, December 9, 2018 - 14:15

పెళ్లి త‌ర్వాత కూడా శ్రియా బిజీగా మారాలని చాలా ప్ర‌య‌త్నించింది. పెళ్లితోనే త‌న కెరియ‌ర్‌కి ఎండ్‌కార్డ్ ప‌డొద్ద‌ని ఆమె చాలా ట్రై చేస్తోంది. కానీ ఈ ఆర్నెళ్ల కాలంలో ఆమెకి కొత్త‌గా పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. ఇటీవల విడుద‌లైన వీర భోగ వసంత రాయ‌లు దారుణంగా ప‌రాజ‌యం పాలైంది. 

ర‌జ‌నీకాంత్ కొత్త సినిమాలో అవ‌కాశం వ‌స్తుంద‌ని చాలా ఆశ‌ప‌డింది. అది కూడా నెర‌వేర‌లేదు. నాగార్జున‌, వెంక‌టేష్‌, చిరంజీవి వంటి సీనియ‌ర్ హీరోలు కూడా శ్రియాతో జ‌త‌క‌ట్ట‌డం లేదు ఇపుడు. మొత్త‌మ్మీద పెళ్లి త‌ర్వాత శ్రియాకి ఆఫ‌ర్లు డ్రై అయ్యాయి.