భ‌ర్త ఫోటోల‌ను మొద‌టిసారి షేర్ చేసింది

Shriya Saran shares husbands pics first time
Thursday, May 30, 2019 - 14:15

శ్రియ శరన్ తన ఫోటోలను రెగ్యులర్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటుంది. కానీ తన భర్త . ఆండ్రి ఫోటోలను అప్‌లోడ్‌
చేయదు. భర్తతో కలిసి దిగిన ఫోటోలను అస్సలు తన టైమ్‌లైన్‌లో కనిపించనివ్వదు. తన భర్త దేశం అయిన రష్యాకి వెళ్లినపుడు కూడా తన సోలో ఫోటోలనే పెడుతుంటుంది. ఐతే తాజాగా ఆమె హబ్బీ ఆండ్రితో ఆనందంగా దిగిన ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలోకి వచ్చాయి.

భర్తకి ముద్దు పెడుతున్న ఫోటోలు కూడా వచ్చాయి. 37 ఏళ్ల శ్రీయ గతేడాది పెళ్లి చేసుకొంది. పెళ్లి తర్వాత బాలయ్య సరసన కథానాయకుడు సినిమాలో నటించింది. ఐతేల‌ ఇపుడు మాత్రం అస్సలు అవకాశాలు రావడం లేదు.