తమిళ సూపర్‌స్టార్ విజయ్ తనది ఎంత గోల్డెన్ హార్టో నిరూపించుకున్నాడు. విజయ్ నటిస్తున్న తాజా చిత్రం..బిగిల్. ఈ సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకోవడంతో ఆ సినిమాకి పనిచేసిన దాదాపు 400 మంది యూనిట్ సిబ్బందికి బంగారుపు ఉంగరాలు ఇచ్చాడు. అవును...ఒకరు కాదు ఇద్దరికీ కాదు ఏకంగా 400 మందికి రింగులు ఇచ్చాడు గిఫ్ట్‌గా. కీర్తి సురేష్ వంటి హీరోయిన్లు ఇంతకుముందు ఇలా చేశారు. మన టాలీవుడ్‌లో మహేష్‌బాబు కూడా శ్రీమంతుడు సినిమా డైరక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన వారందరికీ ఐఫోన్‌లు ఇచ్చాడు. కానీ 400 బంగారు రింగులు ఎవరూ ఇవ్వలేదు. 10 గ్రాముల బంగారం 40 వేలు పలుకుతున్న టైమ్‌లో ఇలా చేయడం విశేషం.
తమిళ అగ్ర దర్శకుడు శంకర్‌కి సీక్వెల్స్ పిచ్చి పట్టుకున్నట్లుంది. ఇప్పటికే రోబోకి సీక్వెల్‌గా 2 పాయింట్ ఓ తీశాడు. ఇక కమల్‌హాసన్‌తోనే భారతీయుడు 2 మొదలుపెట్టాడు. భారతీయుడు సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభం అవుతుంది. ఇలా వరుసగా రెండు సీక్వెల్స్‌తోనే ఆపడం లేదు. అన్నీ అనుకున్నట్లు కుదిరితే .. ఆ తర్వాత ఒకే ఒక్కడు సినిమాకి సీక్వెల్ తీస్తానని తాజాగా శంకర్ ప్రకటించాడు.