విజయ్‌ది గోల్డెన్‌ హార్ట్‌

Vijay gifts gold rings to unit members
Wednesday, August 14, 2019 - 19:00

తమిళ సూపర్‌స్టార్‌ విజయ్‌ తనది ఎంత గోల్డెన్‌ హార్టో నిరూపించుకున్నాడు. విజయ్‌ నటిస్తున్న తాజా చిత్రం..బిగిల్‌. ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకి చేరుకోవడంతో ఆ సినిమాకి పనిచేసిన దాదాపు 400 మంది యూనిట్ సిబ్బందికి బంగారుపు ఉంగరాలు ఇచ్చాడు. అవును...ఒకరు కాదు ఇద్దరికీ కాదు ఏకంగా 400 మందికి రింగులు ఇచ్చాడు గిఫ్ట్‌గా. కీర్తి సురేష్‌ వంటి హీరోయిన్లు ఇంతకుముందు ఇలా చేశారు. మన టాలీవుడ్‌లో మహేష్‌బాబు కూడా శ్రీమంతుడు సినిమా డైరక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన వారందరికీ ఐఫోన్‌లు ఇచ్చాడు. కానీ 400 బంగారు రింగులు ఎవరూ ఇవ్వలేదు. 10 గ్రాముల బంగారం 40 వేలు పలుకుతున్న టైమ్‌లో ఇలా చేయడం విశేషం.

కింది స్థాయి క్రూ అంతా విజయ్‌ని తెగ పొగిడేస్తున్నారు. ఇక టాప్‌ రేంజ్‌ టెక్నిషయన్లకి ఈ రింగ్‌ పెద్ద విషయం కాదు కానీ విజయ్‌ ఇచ్చినది కావడంతో మురిసిపోతూ...... ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు.