విజ‌య్‌తోనే ఒకే ఒక్క‌డు 2!

Oke Okkadu 2 with Vijay, Shankar says
Sunday, November 25, 2018 - 08:30

త‌మిళ అగ్ర ద‌ర్శ‌కుడు శంక‌ర్‌కి సీక్వెల్స్ పిచ్చి ప‌ట్టుకున్నట్లుంది. ఇప్ప‌టికే రోబోకి సీక్వెల్‌గా 2 పాయింట్ ఓ తీశాడు. ఇక క‌మ‌ల్‌హాస‌న్‌తోనే భార‌తీయుడు 2 మొద‌లుపెట్టాడు. భార‌తీయుడు సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ డిసెంబ‌ర్‌లో ప్రారంభం అవుతుంది. ఇలా వ‌రుస‌గా రెండు సీక్వెల్స్‌తోనే ఆప‌డం లేదు. అన్నీ అనుకున్న‌ట్లు కుదిరితే .. ఆ త‌ర్వాత ఒకే ఒక్క‌డు సినిమాకి సీక్వెల్ తీస్తాన‌ని తాజాగా శంక‌ర్ ప్ర‌కటించాడు.

శంక‌ర్ కెరియ‌ర్‌లో ఒకే ఒక్క‌డు ఒక అద్భుత‌మైన చిత్రం. ఒక్క రోజు సీఎం అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ఆ పొలిటిక‌ల్ మూవీ ఒక ట్రెండ్ సెట్ట‌ర్‌. ఇటీవ‌ల వ‌చ్చిన భ‌ర‌త్ అనే నేను, స‌ర్కార్ వంటి స‌హా అనేక సినిమాల‌కి అది స్ఫూర్తి. త‌మిళ సూప‌ర్‌స్టార్ ఇపుడు వ‌రుస‌గా పొలిటిక‌ల్ చిత్రాలే చేస్తున్నాడు అత‌నికి త‌మిళ‌నాడు సీఎం కుర్చీలో కూర్చోవాల‌నే కోరికం బ‌లంగా ఉంది. సో.. విజ‌య్‌కి ఒకే ఒక్క‌డు సీక్వెల్ సూప‌ర్‌గా సూట్ అవుతుంది.

ఇప్ప‌టికే విజ‌య్‌తో స్నేహితుడు (త్రీ ఇడియెట్స్ రీమేక్‌) తీసిన శంక‌ర్ ..ఇపుడు ఒకే ఒక్క‌డు 2 తీస్తాన‌ని అంటున్నాడు. మొత్త‌మ్మీద శంక‌ర్ ఇపుడు త‌న సినిమాలకి ఫ్రాంచైజీలు (1, 2, 3 సీక్వెల్స్‌) తీసుకునే ప‌నిలో ఉన్నాడ‌న్న‌మాట‌.

|

Error

The website encountered an unexpected error. Please try again later.