"అన్నయ్య విషయంలో నాకు ఒకటే అసంతృప్తి. ఇన్ని సినిమాలు చేసినా ఆయనకు ఇంకా జాతీయ అవార్డు రాలేదు. అవార్డు వచ్చే సినిమాలు చాలా చేశారాయన. కానీ ఎందుకో రాలేదు. సైరా సినిమా ఆ లోటు తీరుస్తుందని భావిస్తున్నాను."
సైరాపై నాగబాబు అభిప్రాయమిది. సైరా సినిమా చూశానని, 60 ఏళ్లు దాటినా చిరంజీవిలో ఆ ఫైర్ ఏమాత్రం తగ్గలేదంటున్నారు నాగబాబు. ఇప్పటికీ అన్నయ్యలో అదే కసి, నిబద్ధత కనిపిస్తోందన్నారు. అవార్డు గ్యారెంటీ అంటున్నారు.
60 అంటే రిటైర్మెంట్ ఏజ్. కానీ మన హీరోలు మాత్రం సిక్స్టీ లలో కూడా 20లలో ఎలా ఉంటారో ఆలా ఉంటున్నారు. సినిమా బాలేదనే విషయాన్నీ పక్కన పెడితే, నాగార్జున 'మన్మథుడు 2'లో అదరగొట్టాడు తన లుక్ తో. ఇప్పుడు అందరు మాట్లాడుకుంటున్నది మెగాస్టార్ చిరంజీవి గురించే.
ప్రజారాజ్యం స్థాపించిన టైమ్ లో శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల ప్రచారం చేశారు చిరంజీవి. ఆ తర్వాత మళ్లీ శ్రీకాకుళం గడ్డపై చిరంజీవి అడుగుపెట్టిన దాఖలాలు లేవు. మళ్లీ ఇన్నేళ్లకు ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి జిల్లాగా ఉన్న శ్రీకాకుళంలో అడుగుపెట్టబోతున్నారు మెగాస్టార్. అది కూడా సినిమా షూటింగ్ కోసం కావడం విశేషం.
త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు చిరంజీవి. దీనికోసం ఆయన ప్రత్యేకంగా మేకోవర్ కూడా అయ్యారు. కాస్త బరువు తగ్గి ఫిట్ గా తయారయ్యారు. అంటే కొత్త చిరు అన్నమాట. మెగాస్టార్ 2.0ని చూడబోతున్నాం.