మెగాస్టార్ చిరంజీవి చిత్రసీమకి వచ్చి 41 ఏళ్లు అవుతోంది. తన తండ్రికి ఎపుడూ వెరైటీగా, ప్రేమగా విషెష్ చెపుతుంటాడు రామ్‌చరణ్. చిరు కెరియర్ 41 ఏళ్లు పూర్తయి సందర్భంగా చరణ్ తనదైన శైలిలో విషెష్ చెప్పాడు. తండ్రితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు ఫేస్‌బుక్‌లో.
"సినిమా పరిశ్రమ, నేను మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాం నాన్న. సినిమాల్లో 41 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు అభినందనలు," అంటూ చరణ్ తన తండ్రిని విష్ చేశాడు.
కళాబంధు డా: టి. సుబ్బారామిరెడ్డి కి ఇటీవల విదేశాలలో మోకాలు కి శస్త్ర చికిత్స జరిగింది. నగరానికి విచ్చేసిన సుబ్బారామిరెడ్డి ని ఆయన స్వగృహంలో మెగాస్టార్. చిరంజీవి పరామర్శించారు. చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు డా: టి. సుబ్బారామిరెడ్డి. ఈ సందర్భంగా చిరంజీవి తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్ అద్భుతంగా ఉందని, సినిమా ఘన విజయం సాధించి చరిత్రలో నిలిచిపోతుందని డా: టి. సుబ్బారామిరెడ్డి అభిలషించారు.
అలాగే చిత్ర సమర్పకురాలు శ్రీమతి శ్రీ సురేఖ గారికి, చిత్ర నిర్మాత రాంచరణ్ కు, దర్శకుడు సురేందర్ రెడ్డి కి చిత్ర యూనిట్ సభ్యులందరికీ అభినందనలు తెలిపారు.