అన్నాస‌మేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ విషెష్‌

Pawan Kalyan wishes his brother Megastar happy birthday
Wednesday, August 22, 2018 - 16:00

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌..చాలా త‌క్కువ సంద‌ర్బాల్లోనే త‌న భార్యాపిల్ల‌ల‌తో ప‌బ్లిక్ ప్లేస్‌లో ద‌ర్శ‌న‌మిస్తుంటారు. త‌న వ్య‌క్తిగ‌త జీవితం వ్య‌క్తిగ‌తంగానే ఉండాల‌ని కోర‌కుంటారు. జ‌న‌సేనాని ఇటీవ‌ల విజ‌య‌వాడ‌లో గృహ నిర్మాణానికి భూమి పూజ చేసిన‌పుడు త‌న భార్య అన్నా కొణిదెల‌తో క‌నిపించారు. ఇపుడు మ‌రోసారి భార్యాపిల్ల‌ల‌తో క‌లిసి కెమెరా కంటికి చిక్కారు.

బుధ‌వారం త‌న అన్న‌య్య మెగాస్టార్ పుట్టిన రోజు సంద‌ర్భంగా భార్యాపిల్ల‌ల‌తో క‌లిసి అన్న‌య్య‌ని విష్ చేశారు. చిరంజీవి ఇంటికి వెళ్లి ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా, కూతురు, కొడుకు శుభాకాంక్ష‌లు అంద‌చేశారు. సైరా టీజ‌ర్ అదిరింద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ మెగాస్టార్‌కి చెప్పార‌ట‌. అంచ‌నాల‌ను మించేలా టీజ‌ర్ ఉంద‌ని చెప్ప‌డంతో చిరు య‌మా ఖుషీ అయ్యార‌ని స‌మాచారం.

జ‌న‌సేనాని ఇపుడు సినిమాలు మానేసి త‌న రాజ‌కీయ ప్ర‌స్థానానికే ప‌రిమితం అయ్యారు.