చిరు @41, చెర్రీ విషెష్‌

Chiru's career @41; Ram Charan wishes his father
Saturday, September 22, 2018 - 23:00

మెగాస్టార్ చిరంజీవి చిత్ర‌సీమ‌కి వ‌చ్చి 41 ఏళ్లు అవుతోంది. త‌న తండ్రికి ఎపుడూ వెరైటీగా, ప్రేమ‌గా విషెష్ చెపుతుంటాడు రామ్‌చ‌ర‌ణ్‌. చిరు కెరియ‌ర్‌ 41 ఏళ్లు పూర్తయి సందర్భంగా చరణ్ త‌న‌దైన శైలిలో విషెష్ చెప్పాడు. తండ్రితో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశాడు ఫేస్‌బుక్‌లో.

"సినిమా ప‌రిశ్ర‌మ‌, నేను మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాం నాన్న. సినిమాల్లో 41 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు అభినందనలు," అంటూ చ‌ర‌ణ్ త‌న తండ్రిని విష్ చేశాడు. 

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం జార్జియాలో ఉన్నాడు. ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్‌కి జార్జియా వెళ్లాడు. అక్క‌డే పాతిక రోజులు షూటింగ్‌లో పాల్గొంటాడు. క్ల‌యిమాక్స్‌కి ముందు వ‌చ్చే వార్ ఎపిసోడ్‌ని తీయ‌నున్నారు. ఇక రామ్‌చ‌ర‌ణ్ అజ‌ర్‌బైజాన్ అనే దేశంలో ఉన్నాడు. బోయ‌పాటి తీస్తున్న తాజా సినిమా కోసం అక్క‌డ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు చ‌ర‌ణ్‌.