అరవైలో ఇలా ఎలా? హౌ?

Chiru's look became a hot topic
Monday, August 12, 2019 - 16:45

60 అంటే రిటైర్మెంట్ ఏజ్. కానీ మన హీరోలు మాత్రం సిక్స్టీ లలో కూడా 20లలో ఎలా ఉంటారో ఆలా ఉంటున్నారు. సినిమా బాలేదనే విషయాన్నీ పక్కన పెడితే, నాగార్జున 'మన్మథుడు 2'లో అదరగొట్టాడు తన లుక్ తో. ఇప్పుడు అందరు మాట్లాడుకుంటున్నది మెగాస్టార్ చిరంజీవి గురించే. 

60 ప్లస్ వయసులో ఆయన  స్టైలిష్ గా ఎలా మారారు అనేదే అందరి టాపిక్. నిన్న ఒక ఈవెంట్ కి చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. ఆయన కూర్చున్న ఫోజ్, ఆయన లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఈ లుక్ అంతా నెక్స్ట్ మూవీ కోసమే. కొరటాల శివ దర్శకత్వంలో కొత్త సినిమా మొదలు కానుంది. ఈ మూవీ కోసం ఇలా అయ్యారు చిరు. ఇటీవల ఆయన కొంత బరువు తగ్గారు. దానికి తోడు పేస్ లో కూడా గ్లామర్ వచ్చింది.