ఈషా రెబ్బా అచ్చ తెలుగు అమ్మాయి. తెలుగు అమ్మాయిలకి గ్లామర్ తక్కువ అన్న కామెంట్‌కి విరుద్దంగా ఈ భామ ఆ షోలోనూ ముందుంటోంది. ఐతే అరవింద సమేత సినిమా తర్వాత ఈషాకి మళ్లీ పెద్ద మూవీ ఆఫర్ రాలేదు. ప్రస్తుతం కొంత సైలెంట్ అయింది. అందుకే ఈ భామని బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపిస్తే బాగుంటుందని ఆ షో నిర్వాహకులకి ఆలోచన వచ్చింది. ఆమెని అప్రోచ్ అయిన మాట వాస్తవమే కానీ ఈ వీకెండ్ ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తుందన్న వార్తల్లో నిజం లేదట.
సుమంత్ నటించిన కొత్త చిత్రం....సుబ్రమణ్యపురం. ఈ సినిమాలో రానా వాయిస్ వినిపిస్తుంది. రానా వాయిస్ సినిమా అంతా వినిపించబోతుందట.
సుబ్రహ్మణ్యపురం’’ కీలక సన్నివేశాలకు రానా వాయిస్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ రానాను సంప్రదించింది.దానికి ఆయన వెంటనే అంగీకారం తెలిపారు.
దర్శకుడు సంతోష్ జగర్లపూడి పర్యవేక్షణలో రానా కొన్ని కీలక సన్నివేశాలకు వాయిస్ నిచ్చారు. ఈ చిత్రం కాన్సెప్ట్ ని తెలుసుకొని ఎగ్జైట్ అయ్యారు. కంటెంట్ ఉన్న సినిమా లలో భాగం అయ్యే టాలీవుడ్ హల్క్ రానా కు ‘‘సుబ్రహ్మణ్యపురం’’ ట్రైలర్ కూడా బాగా నచ్చింది.