మన తెలుగు హీరోయిన్లు గ్లామర్ షోలో వీక్ అనేది టాక్. అందుకే అచ్చ తెలుగు అమ్మాయిలకి తెలుగులో అవకాశాలు రావు అనేది వాదన. ఇషా రెబ్బా విషయంలోనూ ఇది కొంత కరెక్ట్. ఈ అమ్మడు టాలెంటే కానీ పెద్ద హీరోయిన్‌గా ఎదగలేకపోతోంది. త్రివిక్రమ్ "అరవింద సమేత"లో ఆమెకి సెకండ్ హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చాడు కానీ ఆమెకిచ్చిన పాత్ర చాలా చిన్నది, ప్రాధాన్యం లేనది.
ఈ శుక్రవారం రిలీజైన "బ్రాండ్‌బాబు"పై కేసు నమోదైంది. ఒక మహిళా జర్నలిస్ట్ సినిమాపై కేసు వేసింది. తన అనుమతి లేకుండా తన ఫోటోని సినిమాలో ఉపయోగించారని ఓ మహిళా జర్నలిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమాలో చావుకి సంబంధించిన సన్నివేశంలో తన ఫోటోని చూపించారని, దీనికి తన పర్మిషన్ తీసుకోలేదని ఆమె ఫిర్యాదు చేశారు.
ఇది తనకి, తన కుటుంబ సభ్యులకి తీవ్ర మనస్థాపం కలిగించిందని ఆమె చెప్పడంతోమూవీ మేకర్స్‌పై ఐపీసీ 509 సెక్షన్ కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత పున్నోడా హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం బ్రాండ్‌బాబు. మారుతి కథ అందించిన మూవీ ఇది. ఆయనే సమర్పుకుడు కూడా. ప్రభాకర్.పి. దర్శకత్వంలో ఎస్.శైలేంద్రబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసుకొంది. సెన్సార్ కంప్లీట్ అయ్యి యూ సర్టిఫికేట్ పొందింది. ఆగస్ట్ 3 న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్అవుతుందని మేకర్స్ ప్రకటించారు.
The film stars newcomer Sumanth Shailendra and Eesha Rebba as the lead pair, while Maruthi has written the script.The film is directed by ETV Prabhakar.