బ్రాండ్‌బాబుకి డేట్ ఫిక్స్‌

Brand Babu gets release date
Monday, July 23, 2018 - 15:15

సుమంత్‌ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత పున్నోడా హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం బ్రాండ్‌బాబు. మారుతి క‌థ అందించిన మూవీ ఇది. ఆయ‌నే స‌మ‌ర్పుకుడు కూడా. ప్రభాకర్‌.పి. దర్శకత్వంలో ఎస్‌.శైలేంద్రబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసుకొంది. సెన్సార్ కంప్లీట్ అయ్యి యూ సర్టిఫికేట్ పొందింది. ఆగస్ట్ 3 న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్అవుతుంద‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

ఈటీవీ ప్ర‌భాక‌ర్‌గా పాపుల‌ర్ అయిన న‌టుడు ప్ర‌భాక‌ర్ ద‌ర్శ‌కుడిగా తీసిన రెండో సినిమా ఇది. ప్ర‌భాక‌ర్ తీసిన మొద‌టి సినిమా ప‌రాజ‌యం పాలైంది. దాంతో ఇపుడు మారుతి క‌థ‌తో తెర‌కెక్కించాడు. ఈషా రెబ్బా ఈ సినిమాపై న‌మ్మ‌కంగా ఉంది.