బ్రాండ్‌బాబుపై జ‌ర్న‌లిస్ట్ కేసు

A case registered on Brand Babu
Saturday, August 4, 2018 - 13:00

ఈ శుక్ర‌వారం రిలీజైన‌ "బ్రాండ్‌బాబు"పై కేసు న‌మోదైంది. ఒక మ‌హిళా జ‌ర్న‌లిస్ట్ సినిమాపై కేసు వేసింది. త‌న‌ అనుమతి లేకుండా తన ఫోటోని సినిమాలో ఉపయోగించార‌ని  ఓ మహిళా జర్నలిస్ట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమాలో చావుకి సంబంధించిన సన్నివేశంలో తన ఫోటోని చూపించార‌ని, దీనికి త‌న ప‌ర్మిష‌న్ తీసుకోలేద‌ని ఆమె ఫిర్యాదు చేశారు.

ఇది త‌న‌కి, త‌న కుటుంబ స‌భ్యుల‌కి తీవ్ర మ‌న‌స్థాపం క‌లిగించింద‌ని ఆమె చెప్ప‌డంతోమూవీ మేకర్స్‌పై ఐపీసీ 509 సెక్షన్ కింద బంజారాహిల్స్  పోలీసులు కేసు నమోదు చేశారు. 

మారుతి క‌థ‌తో రూపొందిన మూవీ...బ్రాండ్ బాబు. ఈ సినిమాతో సుమంత్ శైలేంద్ర అనే క‌న్న‌డ న‌టుడు తెలుగుతెర‌కి ప‌రిచ‌యం అయ్యాడు. ఇషా రెబ్బా హీరోయిన్‌గా న‌టించింది. ఈటీవీ ప్ర‌భాక‌ర్ డైర‌క్ష‌న్ చేశాడు