Manikarnika

కంగ‌నాకి బిస్కెట్ వేస్తున్న వ‌ర్మ

రాంగోపాల్ వ‌ర్మ ఎపుడు ఎవ‌రిని పొగుడుతాడో అర్థం కాదు. ఐతే ఆయ‌న ఎవ‌రిని పొగిడినా..దాని వెనుక ఒక ప‌రమార్థం ఉంటుంది. ఆయ‌న వ్యూహాలు లేట్‌గా అర్థం అవుతాయి. రీసెంట్‌గా ఆయ‌న త‌రుచుగా కంగ‌న ర‌నౌత్‌ని తెగ ప్ర‌శంసిస్తున్నాడు. మ‌ణిక‌ర్ణిక టీజ‌ర్ వ‌చ్చిన‌పుడు ఈ టీజ‌ర్ 2.000 టైమ్స్ అదిరింద‌ని పొగిడాడు.

Kangana says Manikarnika is her film

క్రిష్‌తో పేరు పంచుకుంటోన్న కంగ‌న‌

"మ‌ణిక‌ర్ణిక" సినిమాని 90 శాతం ద‌ర్శ‌కుడు క్రిష్ తీశాడు. ఐతే మొత్తం ర‌ష్ చూసుకున్న కంగ‌నాకి ... కొన్ని సీన్లు న‌చ్చ‌లేదు. దాంతో ఆమె రీషూట్ చేసింది. 45 రోజుల పాటు చిత్రీక‌రించింది. ఒక ద‌శ‌లో డైర‌క్ట‌ర్‌గా క్రిష్ పేరు తొల‌గించి, త‌న పేరే వేసుకుంటుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఐతే ఆ మ‌ధ్య విడుద‌లైన ట్ర‌యిల‌ర్‌లో మాత్రం  జాగ‌ర్ల‌మూడి రాధాకృష్ణ అనే పేరుని ఉంచారు. దాంతో క్రిష్ ఊపిరి పీల్చుకున్నాడు.

Krish's Manikarnika teaser impresses

45 రోజులు రీషూట్

కంగ‌న ర‌నౌత్ మొండిఘ‌టం. రియ‌ల్ లైఫ్‌లో ఆమెకి అలాంటి ఇమేజ్‌ ఉంది. ఎంత‌టి వారినైనా ఎదుర్కొంటుంది. ఏ విష‌యంలోనూ వెన‌క్కి త‌గ్గ‌ద‌ని హృతిక్ రోష‌న్‌తో ఆమె గొడ‌వ‌ప‌డ్డ తీరు చెపుతోంది. అంతేకాదు క్వీన్, త‌ను వెడ్స్ మ‌ను వంటి సినిమాల టైమ్‌లోనూ ద‌ర్శ‌కుల‌తో గొడ‌వ‌ప‌డి ఫైన‌ల్‌గా త‌న‌కి న‌చ్చిన‌ట్లు ఎడిట్ చేయించుకొంది. అది ఆమె తీరు. ఇక ఇపుడు మ‌ణిక‌ర్ణిక విష‌యంలోనూ అదే పంథాలో వెళ్తోంది. ద‌ర్శ‌కుడు క్రిష్ .."మ‌ణిక‌ర్ణిక" చిత్రాన్ని 95 శాతం పూర్తి చేసి ఎన్టీఆర్ బ‌యోపిక్ షూటింగ్‌కి వ‌చ్చాడు. 

డైర‌క్ట‌ర్‌గా క్రిష్ పేరు తొల‌గించిన కంగ‌న‌

అనుకున్న‌ట్లే జ‌రిగింది. "మ‌ణిక‌ర్ణిక" సినిమాకి డైర‌క్ట‌ర్‌గా త‌న పేరు వేసుకొంది కంగ‌న ర‌నౌత్‌. "మణిక‌ర్ణిక" సినిమా మొత్తాన్ని క్రిష్ డైర‌క్ట్ చేయ‌గా ఇపుడు రీషూట్ మొద‌లుపెట్టింది కంగ‌న‌. అంతేకాదు డైర‌క్ట‌ర్‌గా తన పేరును చెప్పుకుంటోంది. క్లాప్‌బోర్డ్ మీద డైర‌క్ట‌ర్‌: క‌ంగ‌న ర‌నౌత్ అనే పేరు ఉన్న ఫోటో ఒకటి తాజాగా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

డైర‌క్ట‌ర్ క్రిష్‌తో గొడ‌వ‌ప‌డ‌లేద‌ట‌

"మ‌ణిక‌ర్ణిక" సినిమాకి సంబంధించిన షూటింగ్‌, ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను ద‌ర్శ‌కుడు క్రిష్‌తో సంబంధం లేకుండా కంగ‌నా ర‌నౌత్ చూసుకుంటోంద‌నేది నిజం. తెలుగు సినిమా.కామ్ ఈ న్యూస్‌ని ఇంత‌కుముందే ప్ర‌చురించింది. "మ‌ణిక‌ర్ణిక" షూటింగ్‌ని క్రిష్ మ్యాగ్జిమ‌మ్ పూర్తి చేసినా.. కంగ‌నాకి కొన్ని సీన్లు న‌చ్చ‌లేదు. వాటిని రీషూట్ చేయాల‌ని కోరింది. కానీ అప్ప‌టికే క్రిష్ ..ఎన్టీఆర్ బ‌యోపిక్ ఒప్పుకున్నాడు. దాంతో చేయలేన‌ని అన్నాడు. విచిత్రం ఏమిటంటే.. ఏ ద‌ర్శ‌కుడు అయినా ఒక సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పూర్త‌యి, సెన్సార్ పూర్త‌య్యేవ‌ర‌కు ఆ సినిమాతోనే ఉంటాడు, మ‌రో సినిమా షూటింగ్ ఒప్పుకున్నాను అని వెళ్ల‌కూడ‌దు.

Kangana talks about love and marriage

Krish wraps up Manikarnika shoot

Krish registers 'Aaham Brahmasmi' for top star

Pages

Subscribe to RSS - Manikarnika
|

Error

The website encountered an unexpected error. Please try again later.