45 రోజులు రీషూట్

కంగన రనౌత్ మొండిఘటం. రియల్ లైఫ్‌లో ఆమెకి అలాంటి ఇమేజ్ ఉంది. ఎంతటి వారినైనా ఎదుర్కొంటుంది. ఏ విషయంలోనూ వెనక్కి తగ్గదని హృతిక్ రోషన్‌తో ఆమె గొడవపడ్డ తీరు చెపుతోంది. అంతేకాదు క్వీన్, తను వెడ్స్ మను వంటి సినిమాల టైమ్‌లోనూ దర్శకులతో గొడవపడి ఫైనల్‌గా తనకి నచ్చినట్లు ఎడిట్ చేయించుకొంది. అది ఆమె తీరు. ఇక ఇపుడు మణికర్ణిక విషయంలోనూ అదే పంథాలో వెళ్తోంది. దర్శకుడు క్రిష్ .."మణికర్ణిక" చిత్రాన్ని 95 శాతం పూర్తి చేసి ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్‌కి వచ్చాడు.
ఇపుడు ఆమె సినిమాలో సగభాగం రీషూట్ చేస్తోంది. బాలీవుడ్ మీడియా వార్తల ప్రకారం.. 45 రోజుల పాటు రీషూట్ చేస్తుందట. ఇప్పటికే ఈ సినిమాకి డైరక్టర్‌గా తన పేరును వేసుకొంది. ఇక రీషూట్ తర్వాత క్రిష్ పేరు సినిమాలో ఉండడం అనేది డౌటే. క్రిష్ తీసిన సీన్లు ఆమెకి చాలా వరకు నచ్చలేదట.
కంగనా అమెరికాలో డైరక్షన్ కోర్సు కూడా పూర్తి చేసింది. అందుకే తన సినిమాల డైరక్షన్‌లో ఆమె బాగా కలుగచేసుకుంటుంది. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత ఎడిట్ భాగాన్ని చూసి ఏమి ఉంచాలో, ఏది తీసెయ్యాలో ఆమె డిసైడ్ చేస్తుంది. క్రిష్ తీసిన దాంట్లో సగం తొలగించి రీషూట్ చేస్తోందిపుడు.
- Log in to post comments