కంగనాకి బిస్కెట్ వేస్తున్న వర్మ
రాంగోపాల్ వర్మ ఎపుడు ఎవరిని పొగుడుతాడో అర్థం కాదు. ఐతే ఆయన ఎవరిని పొగిడినా..దాని వెనుక ఒక పరమార్థం ఉంటుంది. ఆయన వ్యూహాలు లేట్‌గా అర్థం అవుతాయి. రీసెంట్‌గా ఆయన తరుచుగా కంగన రనౌత్‌ని తెగ ప్రశంసిస్తున్నాడు. మణికర్ణిక టీజర్ వచ్చినపుడు ఈ టీజర్ 2.000 టైమ్స్ అదిరిందని పొగిడాడు.
ఇక తాజాగా మణికర్ణిక ట్రయిలర్ విడుదలయింది. ఈ ట్రయిలర్ చూసి.. కంగనాని ఓ రేంజ్‌లో మునగచెట్టు ఎక్కిస్తున్నాడు. ఈ సినిమాలో కంగనా చూపిన ఆవేశం, నిప్పులు కక్కే ఆ కళ్లలోని తీవ్రత చూస్తే బ్రూస్‌లీ గుర్తొచ్చాడు అట. బ్రూస్‌లీ తర్వాత కంగనాలోనే ఆ రేంజ్ ఇంటెన్సిటీని చూశానని వర్మ కాంప్లిమెంట్స్ ఇచ్చాడు.
ఐతే వర్మ ఆమెకిపుడు బిస్కెట్ వేయడం వెనుక రీజనేంటి? ఆమెతో సినిమా ప్లాన్ చేసేందుకే ఇప్పటి నుంచి ఇలా ప్రశంసలు కురిపిస్తున్నాడా అన్న డౌట్స్ వస్తున్నాయి.
- Log in to post comments