తెలుగువారి ఆత్మ గౌరవ నినాదంతో ప్రజల్లోకి వచ్చి ఢిల్లీ పీఠంపై ఉన్న కాంగ్రెస్స్ వెన్నులో వణుకు పుట్టించిన మహా నాయకుడు నందమూరి తారక రామారావు. ఆయన బయోపిక్‌ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. రెండో భాగం అంతా మహా నాయకుడిగా ఎదిగిన వైనం, తెలుగువారి ఆత్మ గౌరవం నిలిపిన తీరుని చూపిస్తారు అని ముందు నుంచీ ప్రేక్షక లోకమే కాదు చిత్ర సీమ అంతా ఫిక్స్ అయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు ‘ఎన్టీఆర్’ బయో పిక్ మీద ప్రభావం చూపిస్తాయా? ఎన్టీఆర్ తెలుగువారికి విలన్ గా భావించిన కాంగ్రెస్స్ పార్టీని ఈ బయో పిక్ లో ఎలా చూపిస్తారు అనే చర్చ మొదలైంది.
మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ ఇన్నింగ్స్ ముగిసిందని అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో కొన్నాళ్లూగా యాక్టివ్‌గా లేరు. కాంగ్రెస్ పార్టీ కలాపాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఖైదీ నెంబర్ 150తో సక్సెస్‌ఫుల్‌గా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇపుడు హాయిగా సినిమాలు చేసుకుంటున్నారు. అంతేకాదు, ఆయన రాజ్యసభ పదవీకాలం కూడా ముగిసింది. ఇపుడు ఆయన మాజీ ఎంపీ మాత్రమే.