ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్-ఆర్-ఆర్ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ మూవీ తర్వాత యంగ్ టైగర్ చేయబోయే సినిమా ఫిక్స్ అయింది. మరోసారి త్రివిక్రమ్ తో కలిసి సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్. ఈ మేరకు అనధికారికంగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అది నిజం కూడా.
"స్టూడెంట్ నెంబర్‌వన్"సినిమాతో రాజమౌళి దర్శకుడిగా ఎదిగారు. 18 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు విడుదలైంది స్టూడెంట్ నెంబర్‌వన్. జూనియర్ ఎన్టీఆర్‌కి తొలి హిట్. రాజమౌళి కెరియర్‌కి అరంగేట్రం. ఈ 18 ఏళ్ల కాలంలో రాజమౌళి నెంబర్‌వన్ డైరక్టర్‌గా ఎదిగారు. జూనియర్ ఎన్టీఆర్ అగ్ర హీరోల్లో ఒకరిగా స్థిరపడ్డారు.