"అజ్ఞాతవాసి", "నా పేరు సూర్య" సినిమాల్లో అవకాశం వచ్చినపుడు అను ఇమ్మాన్యుయేల్ ఎక్కడికో వెళ్తుందనిపించింది. అగ్ర హీరోయిన్ల జాబితాలో ఖాయంగా ఉంటుందనుకున్నారంతా. కానీ రెండు సినిమాలు మెగా ఫ్లాప్ కావడంతో ఆమె ఆశలు గల్లంతయ్యాయి. అవకాశాలు తగ్గాయి. ఇపుడు చేతిలో ఒకే ఒక్క మూవీ ఉంది.
నాగ శౌర్య ఈ ఏడాది "ఛలో" సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. స్వంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పతాకంపై ఆ సినిమాని తీసి విజయం అందుకున్నాడు. అదే బ్యానర్‌పై ఇంకో సినిమాని రెడీ చేస్తున్నాడు. "నర్తనశాల" పేరుతో తెరకెక్కుతోన్న కొత్త సినిమా ప్రచారం మొదలుపెడుతున్నాడు.
కొత్త దర్శకుడు శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నఈ సినిమా ఫస్ట్ లుక్ శుక్రవారం (జులై 20న) వచ్చేస్తోంది. అంటే ప్రమోషన్ మొదలైంది.