మహేష్‌బాబు 25వ చిత్రం.."మహర్షి". ఇందులో మహేష్‌బాబుకి ఫ్రెండ్‌గా అల్లరి నరేష్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో తన పాత్ర గురించి చిన్న క్లూ ఇచ్చాడు అల్లరి హీరో. నాది కీలకమైన పాత్ర. "గమ్యం"లో గాలి శీను పాత్రలా ఇంటెన్స్‌గా ఈ పాత్ర ఉంటుందని చెప్పాడు అల్లరి నరేష్. గాలిశీను పాత్ర తనకి ఎంత పేరు తెచ్చిందో ఇది అంతకన్నా ఎక్కువ నేమ్ తీసుకొస్తుందని ధీమాగా చెపుతున్నాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా "సిల్లీఫెలోస్" ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రంలో అల్లరి నరేష్, సునీల్, చిత్రాశుక్లా, పూర్ణ, నందినిరాయ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. భీమినేని శ్రీనివాస్ ఈ చిత్రాన్ని ఆద్యంతం అలరించే విధంగా తెరకెక్కించారు. ఈ చిత్రంతోనే సునీల్ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో కీలకపాత్రలో నటించారు సునీల్.