సిల్లీఫెలోస్‌తోనే సునీల్ కామెడీ

Sunil's re-entry as comedian with Silly Fellows
Sunday, August 26, 2018 - 23:45

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ బాబు చేతుల మీదుగా "సిల్లీఫెలోస్" ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేష్, సునీల్, చిత్రాశుక్లా, పూర్ణ‌, నందినిరాయ్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. భీమినేని శ్రీ‌నివాస్ ఈ చిత్రాన్ని ఆద్యంతం అల‌రించే విధంగా తెర‌కెక్కించారు. ఈ చిత్రంతోనే సునీల్ కమెడియ‌న్ గా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టించారు సునీల్.

అల్ల‌రి న‌రేష్‌కి ఈక్వెల్‌గా ఉండే పాత్ర‌నే. ఐతే దీన్ని హీరో రోల్ అని అన‌డం లేదు. క‌మెడియ‌న్‌గానే చూడాలంటున్నాడు సునీల్‌. సునీల్ ఇప్ప‌టికే హీరో పాత్ర‌ల‌కి కామా పెట్టాడు. హీరోగా వ‌రుస అప‌జ‌యాలు వ‌చ్చాయి. దాంతో కామెడీ పాత్ర‌లు చేస్తున్నాడిపుడు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. సెప్టెంబ‌ర్ 7న విడుద‌ల కానుంది సిల్లీఫెలోస్.