Box Office

మొదటిరోజు మెరిసిన దేవదాస్

నాగార్జున, నాని కలిసి నటించిన "దేవదాస్" సినిమా మొదటి రోజు బాగానే మెరిసింది. అక్కడక్కడ మిక్స్ డ్ రిజల్ట్ ఉన్నప్పటికీ, సినిమాపై ఉన్న క్రేజ్ కారణంగా ఫస్ట్ డే మంచి వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 4 కోట్ల 67 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఇక వరల్డ్ వైడ్ చూసుకుంటే, 6 కోట్ల 57 లక్షల రూపాయల షేర్ వచ్చింది దేవదాస్ సినిమాకు. ప్రస్తుతం మార్కెట్లో బ్రహ్మాడంగా ఆడుతున్న సినిమాల్లేవు.

"శైలజారెడ్డి అల్లుడు" మాత్రమే ఉన్నంతలో మెరుగ్గా నడుస్తోంది. కాబట్టి, ఈ వీకెండ్ దేవదాస్ కు అదిరిపోయే వసూళ్లు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ఏపీ, నైజాంలో దేవదాస్ కు వచ్చిన మొదటి రోజు షేర్ ఇలా ఉంది.

Box-Office: C/o Kancharapalem posts decent numbers

Geetha Govindam: USA Collections

Saakshyam takes good opening

విశ్వ‌రూపం 2 తెలుగు రిలీజ్ ఉందా?

"విశ్వ‌రూపం 2" ఆగ‌స్ట్ 10న విడుద‌ల అంటూ త‌మిళం, మ‌ల‌యాళం పోస్ట‌ర్స్ సోష‌ల్ మీడియాలో రెండు రోజులుగా ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఈ సినిమా వాయిదాప‌డింద‌ని అంద‌రూ భావిస్తున్న టైమ్‌లో ఈ డేట్ పోస్ట‌ర్స్ ప్ర‌త్య‌క్షం కావ‌డం విశేషం. ఇంత‌కీ నిజంగా ఈ మూవీ ఆగ‌స్ట్ 10న వ‌స్తుందా?

దిల్‌రాజు బ్రాండ్‌కి పెద్ద దెబ్బ

దిల్‌రాజు బ్యాన‌ర్‌కి ఒక నేమ్ ఉంది. ఆయ‌న సినిమాల‌కి మినిమం ఓపెనింగ్స్ ఉంటాయి. ఐతే ఈ మ‌ధ్య దిల్‌రాజు నేల మీద నిల‌వ‌డం లేదు. ఎలాంటి సినిమానైనా హిట్ చేయ‌గ‌లం, ఓపెనింగ్ తీసుకురాగ‌ల‌మ‌ని అతి విశ్వాసంతో ఉన్నారు. అందుకే భూమ్మీద‌కి తీసుకురావాల‌ని గ‌ట్టి షాక్ ఇచ్చిన‌ట్లున్నారు జ‌నం. 

ల‌వ‌ర్‌... దిల్‌రాజు బ్యాన‌ర్ సినిమా క‌దా అని ప్ర‌సాద్ మ‌ల్టీప్లెక్స్‌లో ఉద‌యం 8.45 షోల‌ను రెండు థియేట‌ర్ల‌లో వేశారు. రెండు థియేట‌ర్ల‌కి వ‌చ్చిన జనంని ఒక థియేట‌ర్లో స‌ర్దినా.. ఇంకా 40 శాతం సీట్లు ఖాళీగా ఉంటాయి. ఆ రేంజ్‌లో వ‌చ్చారు జ‌నం ల‌వ‌ర్ చిత్రానికి మొద‌టి రోజు. 

ఆర్ఎక్స్‌100 ఇంకా ఎంత క‌లెక్ట్ చేస్తుంది?

ఒక చిన్న సినిమా 10 కోట్ల థియేట‌ర్ వ‌సూళ్ల‌ను సంపాదించ‌డం అంటే మాములు మేట‌ర్ కాదు. కొత్త తార‌ల‌తో కొత్త ద‌ర్శ‌కుడు కొత్త నిర్మాత తీసిన "ఆర్ఎక్స్ 100" షేర్ ఇప్ప‌టికే 9 కోట్ల రూపాయ‌ల‌ ద‌గ్గ‌రికి వ‌చ్చింది. ఒక నైజాంలోనే 4 కోట్ల షేర్‌ని దాటింది. మొత్తం ర‌న్ పూర్త‌య్యేస‌రికి ఎంత వ‌సూల్ చేయ‌గ‌లదు?

ట్రేడ్ పండితుల అంచ‌నా ప్ర‌కారం ఈ సినిమా రూ. 14 నుంచి రూ.15 కోట్ల వ‌ర‌కు రాబ‌ట్టగ‌ల‌ద‌ని అంచ‌నా.  నైజాంలో ఏడు కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు, ఉత్త‌రాంధ్ర‌లో కోటిన్న‌ర వ‌ర‌కు, సీడెడ్‌లోనూ కోటిన్న‌ర వ‌ర‌కు రాబ‌డుతుంద‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అంటే పెళ్లి చూపులు సినిమా కంటే పెద్ద హిట్ అవుతుంది ఈ మూవీ. 

Vijetha turns out to be loser!

Half year Report: Hits and Misses of 2018

Mahanati joins $1 million club

Pages

Subscribe to RSS - Box Office