విశ్వరూపం 2 తెలుగు రిలీజ్ ఉందా?

"విశ్వరూపం 2" ఆగస్ట్ 10న విడుదల అంటూ తమిళం, మలయాళం పోస్టర్స్ సోషల్ మీడియాలో రెండు రోజులుగా దర్శనమిస్తున్నాయి. ఈ సినిమా వాయిదాపడిందని అందరూ భావిస్తున్న టైమ్‌లో ఈ డేట్ పోస్టర్స్ ప్రత్యక్షం కావడం విశేషం. ఇంతకీ నిజంగా ఈ మూవీ ఆగస్ట్ 10న వస్తుందా?
ఈ సినిమాని ఇంతవరకు తెలుగులో ఎవరూ కొనలేదు. ఇప్పటి వరకు ప్రమోషన్ కూడా లేదు. తెలుగు, హిందీ భాషల్లో తర్వాత విడుదల చేస్తారేమో. తమిళ, మలయాళ భాషల్లో ఆగస్ట్ 10న రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే తమిళనాట కూడా ఈ సినిమాకి ఇంకా క్రేజ్ రాలేదు. ఎందుకంటే ఒక పెద్ద సినిమాకి చేయాల్సినంత ప్రమోషన్ కూడా ఇంతవరకు చేయలేదు. ఒక ట్రయిలర్ విడుదల చేసి, ఒక పాట రిలీజ్ చేసి ఊరుకున్నాడు కమల్.
ఐతే తమిళనాట కమల్‌హాసన్ బిగ్‌బాస్ షోకి యాంకర్. తన షోలో "విశ్వరూపం 2 " ప్రమోట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. సో.. తమిళం విడుదల వరకు ప్రమోషన్ సమస్య లేదు. తెలుగు, హిందీ మార్కెట్‌లలో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రచారం లేదు. హైప్ కూడా లేదు. కమల్ దర్శకత్వం వహించి, నిర్మించి నటించిన "విశ్వరూపం 2"లో పూజా కుమార్ హీరోయిన్. "విశ్వరూపం" సినిమాకిది ప్రీక్వెల్.
- Log in to post comments