దిల్‌రాజు బ్రాండ్‌కి పెద్ద దెబ్బ

Dil Raj gets shock with Lover
Sunday, July 22, 2018 - 00:30

దిల్‌రాజు బ్యాన‌ర్‌కి ఒక నేమ్ ఉంది. ఆయ‌న సినిమాల‌కి మినిమం ఓపెనింగ్స్ ఉంటాయి. ఐతే ఈ మ‌ధ్య దిల్‌రాజు నేల మీద నిల‌వ‌డం లేదు. ఎలాంటి సినిమానైనా హిట్ చేయ‌గ‌లం, ఓపెనింగ్ తీసుకురాగ‌ల‌మ‌ని అతి విశ్వాసంతో ఉన్నారు. అందుకే భూమ్మీద‌కి తీసుకురావాల‌ని గ‌ట్టి షాక్ ఇచ్చిన‌ట్లున్నారు జ‌నం. 

ల‌వ‌ర్‌... దిల్‌రాజు బ్యాన‌ర్ సినిమా క‌దా అని ప్ర‌సాద్ మ‌ల్టీప్లెక్స్‌లో ఉద‌యం 8.45 షోల‌ను రెండు థియేట‌ర్ల‌లో వేశారు. రెండు థియేట‌ర్ల‌కి వ‌చ్చిన జనంని ఒక థియేట‌ర్లో స‌ర్దినా.. ఇంకా 40 శాతం సీట్లు ఖాళీగా ఉంటాయి. ఆ రేంజ్‌లో వ‌చ్చారు జ‌నం ల‌వ‌ర్ చిత్రానికి మొద‌టి రోజు. 

ఇక తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లోనూ సేమ్ సీన్ క‌న‌ప‌డింది ఈ సినిమాకి తొలి రోజు. రాజ్ త‌రుణ్ రీసెంట్‌గా వ‌రుస ఫ్లాప్‌లు ఇవ్వ‌డం వ‌ల్ల ఆయ‌న సినిమాకి క్రేజ్ త‌గ్గింద‌నేది వాస్త‌వ‌మే. ఈ సినిమా తొలి రోజు అన్ని చోట్ల క‌లిపి 45 ల‌క్ష‌ల రూపాయ‌ల షేర్‌ని మాత్ర‌మే రాబ‌ట్టింది. ఇంత వీక్ ఓపెనింగ్ ..దిల్‌రాజ్‌కి షాక్‌. 

బ్యాడ్ సినిమాని ఎవ‌రూ నిల‌బెట్ట‌లేరు....దిల్‌రాజు ఐనా, ఎవ‌రైనా. ఐతే ఓపెనింగ్‌ని కూడా తీసుకురాలేక‌పోవ‌డం మాత్రం ఆయ‌న లెక్క‌ల‌కి అంద‌నిది.