Comedian Ali

ఆలీ అతి నమ్మకం

రాజుగారి గది 3 ప్రేక్షకులను నవ్వించి నవ్వించి పొట్ట చెక్కలయ్యేలా చేస్తుంది అంటున్నారు ఆలీ. 1100 పైగా చిత్రాల్లో నటించిన కమిడియన్ ఆలీ లేటెస్ట్ గా నటించిన రాజు గారి గది 3 అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. "నేను ఇప్పటివరకు చేసిన చిత్రాలు ఒక ఎత్తు ఈ రాజు గారి గది 3 మరో ఎత్తు. అన్నీ ఎమోషన్స్ ఉన్న పాత్ర నాకు ఇచ్చారు ఓంకార్," అన్నారు ఆలీ. 

Ali as judge for Jabardasth now!

అలీకి, ల‌లితా గుండుబాస్‌కి లింకేంటి?

పదివేల కోట్లరూపాయల స్వర్ణ సామ్రాజ్యానికి అధినేతగా ఎదిగిన కిర‌ణ్‌కుమార్ పేరు చాలామందికి తెలియ‌దు. కానీ లలిత జ్యుయ‌ల‌రీస్ గుండుబాస్ అంటే అంద‌ర‌కీ అర్థ‌మ‌వుతుంది. ఆయ‌నే మోడ‌ల్‌గా న‌టించిన జ్యుయ‌ల‌రీ యాడ్ చాలా పాపుల‌ర్ అయింది. మా షాప్‌లో కొనేముందు మూడు నాలుగు చోట్లా క‌నుక్కొని, ధ‌ర భేరీజు వేసుకొని రండి అని చెప్పిన యాడ్ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది. డ‌బ్బులు ఊరికే రావు క‌దా అనే ఆయ‌న పంచ్‌లైన్ కూడా అదిరింది.

Comedian Ali joins YSRC party

Comedian Ali to contest from Guntur East

అలీకి వెల్క‌మ్ చెప్పిన చంద్ర‌బాబు

క‌మెడియ‌న్ అలీ 40 ఏళ్ల సినిమా కెరియ‌ర్‌ని పూర్తి చేసుకున్నాడు. ఇక ఇపుడు అత‌ని దృష్టి రాజ‌కీయాల‌పై ప‌డింది. ఎమ్మెల్యేగా బ‌రిలోకి దిగాల‌ని మొద‌ట వైఎస్సార్సీ పార్టీని సంప్ర‌తించాడు. అంత‌కుముందు జ‌న‌సేన‌లో ఉన్నాడు. చివ‌రికి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రెడీ అయ్యాడు. అందుకే త‌న 40 ఏళ్ల కెరియ‌ర్ కార్య‌క్ర‌మానికి ఏపీ సీఎం చంద్ర‌బాబుని ముఖ్య అతిథిగా ఆహ్వానించాడు. 

పార్టీల‌తో అలీ దోబూచ‌లాట‌

క‌మెడియ‌న్ అలీ ఈ సారి ఏపీ ఎన్నిక‌ల బ‌రిలో దిగాల‌నుకుంటున్నాడు. త‌న సొంత ప‌ట్ట‌ణ‌మైన రాజ‌మండ్రి నుంచి కానీ, గుంటూరు నుంచి కానీ బ‌రిలోకి దిగాల‌నేది ఆయ‌న డ్రీమ్‌. గుంటూరు సీటుని ముస్లింలు అధికంగా ఉన్నార‌నే కార‌ణంతో అడుగుతున్నాడు. మొన్న వైఎస్సార్సీ అధినేత జ‌గ‌న్‌ని క‌లిసి అంద‌ర్నీ స‌ర్‌ప్రైజ్ చేశాడు. ఇపుడు తెలుగుదేశం పార్టీ మంత్రి గంటాని క‌లిసి మ‌ళ్లీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఇంత‌కీ ఏ పార్టీలో చేర‌నున్నాడు? ఏ విష‌య‌మైనా సంక్రాంతి త‌ర్వాత అంటే జ‌న‌వ‌రి 16న ప్ర‌క‌టిస్తాన‌ని అంటున్నాడు అలీ.

అలీ జ‌న‌సేనానితోనే!

ఎమ్మెల్యే కావాల‌నేది కమెడియ‌న్ అలీ డ్రీం. మొన్న‌టి వ‌ర‌కు తెలుగుదేశం పార్టీకి మ‌ద్ద‌తుదారుగా ఉన్నాడు. ఇపుడు ప‌వ‌ర్‌స్టార్‌తోనే రాజ‌కీయ ప్ర‌యాణం చేయ‌నున్నాడు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున పోటీ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

అలీ, ప‌వ‌ర్‌స్టార్ ఫ్రెండ్సిప్ ఈనాటిది కాదు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కెరియ‌ర్ ప్రారంభం నుంచి అలీ ఆయ‌న‌తో స్నేహంగా ఉంటున్నాడు. అలీ లేకుండా సినిమా ఎలా చేస్తాను అని ఆ మ‌ధ్య ఒక ఈవెంట్‌లో స‌ర‌దాగా చెప్పాడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. అంత‌టి స్నేహ‌బంధం వారిది. అందుకే జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున రాజ‌మండ్రి అసెంబ్లీ సీటుని జ‌న‌సేన అధినేత అలీకి ఇస్తాన‌ని ప్రామిస్ చేశాడ‌ట‌.

Maa Aayana Bangaram, says Ali's wife

Subscribe to RSS - Comedian Ali
|

Error

The website encountered an unexpected error. Please try again later.