అలీ జ‌న‌సేనానితోనే!

Pawan Kalyan field Ali on his party ticket
Wednesday, October 25, 2017 - 15:45

ఎమ్మెల్యే కావాల‌నేది కమెడియ‌న్ అలీ డ్రీం. మొన్న‌టి వ‌ర‌కు తెలుగుదేశం పార్టీకి మ‌ద్ద‌తుదారుగా ఉన్నాడు. ఇపుడు ప‌వ‌ర్‌స్టార్‌తోనే రాజ‌కీయ ప్ర‌యాణం చేయ‌నున్నాడు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున పోటీ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

అలీ, ప‌వ‌ర్‌స్టార్ ఫ్రెండ్సిప్ ఈనాటిది కాదు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కెరియ‌ర్ ప్రారంభం నుంచి అలీ ఆయ‌న‌తో స్నేహంగా ఉంటున్నాడు. అలీ లేకుండా సినిమా ఎలా చేస్తాను అని ఆ మ‌ధ్య ఒక ఈవెంట్‌లో స‌ర‌దాగా చెప్పాడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. అంత‌టి స్నేహ‌బంధం వారిది. అందుకే జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున రాజ‌మండ్రి అసెంబ్లీ సీటుని జ‌న‌సేన అధినేత అలీకి ఇస్తాన‌ని ప్రామిస్ చేశాడ‌ట‌.

అలీ పుట్టింది రాజ‌మండ్రిలోనే. చాలా ఏళ్లుగా అలీ ఆ చుట్టుప‌క్క‌ల అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నాడు. ప‌వ‌ర్‌స్టార్ పార్టీ త‌ర‌ఫున వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే టాలీవుడ్ సెల‌బ్రీటీస్‌ల్లో అలీ క‌న్‌ఫ‌మ్ అయిన‌ట్లే.