ఆలీ అతి నమ్మకం

Ali talks about RGG3
Sunday, October 13, 2019 - 17:00

రాజుగారి గది 3 ప్రేక్షకులను నవ్వించి నవ్వించి పొట్ట చెక్కలయ్యేలా చేస్తుంది అంటున్నారు ఆలీ. 1100 పైగా చిత్రాల్లో నటించిన కమిడియన్ ఆలీ లేటెస్ట్ గా నటించిన రాజు గారి గది 3 అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. "నేను ఇప్పటివరకు చేసిన చిత్రాలు ఒక ఎత్తు ఈ రాజు గారి గది 3 మరో ఎత్తు. అన్నీ ఎమోషన్స్ ఉన్న పాత్ర నాకు ఇచ్చారు ఓంకార్," అన్నారు ఆలీ. 

"మొదట నాకు కాల్ చేసి నైట్ ఎఫెక్ట్ లో ఎక్కువ సినిమా ఉంటుంది. ఈ రోల్ మీరు చేస్తేనే బాగుంటుందని చెప్పడంతో కథవిన్నాను. సబ్జెక్ట్ బాగా నచ్చి ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకోవడం జరిగింది. రాజు గారి గది 1, 2 లో అశ్విన్ చేసిన పాత్రలకు ఈ సినిమాలో తను చేసిన పాత్రకు చాలా మార్పులు ఉన్నాయి. ఈ మూవీలో ఫుల్ లెన్త్ రోల్ లో అశ్విన్ ప్రేక్షకులను అలరిస్తాడు.తనకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టడమే కాకుండా నటుడిగా మరో ఎత్తుకు ఎదిగేలా చేస్తుంది. ఓంకార్ చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు," ఇలా ఆకాశానికి ఎత్తాడు ఆలీ. 

రీసెంట్ గా ఆలీకి సరైన పాత్రలు దక్కడం లేదు. సినిమా ఆఫర్లు తగ్గాయి. మరి ఈ మూవీ ఐనా మరోసారి ఊపు తెస్తుందా?