Congress

Vijayashanti denies reports of joining BJP

Bandla Ganesh seeking MLC ticket

బాల‌య్య డైలాగ్ వ‌ల్లించిన బండ్ల గ‌ణేష్‌

"స‌ర్‌..స‌ర్లే ...ఎన్నెన్నో అనుకుంటాం. అన్ని జ‌రుగుతాయా ఏమిటి" అని వీర‌భ‌ద్ర సినిమాలో నంద‌మూరి బాల‌కృష్ణ ఒక డైలాగ్ చెపుతాడు. ఆ సినిమాలో బండ్ల గ‌ణేష్ కూడా న‌టించాడు. ఇపుడు బండ్ల గ‌ణేష్ రియ‌ల్‌లైఫ్‌లో బాల‌య్య డైలాగ్ వ‌ల్లిస్తున్నాడు.

ఎన్నికల టైమ్‌లో వంద అంటాం.. అన్నీ చేస్తామా? ఏమిటి? అని తాజాగా స్పందించాడు బండ్ల గ‌ణేష్‌. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ప్ప‌కుండా గెలుస్తుంద‌ని జ‌ర్న‌లిస్ట్‌ల‌తో, మీడియాతో బెట్టింగ్‌లు క‌ట్టాడు బండ్ల‌. అంతేకాదు, ఒక‌వేళ తెరాస గెలిస్తే సెవ‌న్ ఓ క్లాక్ బ్లేడ్‌తో త‌న గొంతు కోసుకుంటా అని శ‌పథం చేశాడు.

What next for Vijayashanti?

రాముల‌మ్మ‌కి పిక్చ‌ర్ అర్థ‌మైందా?

విజ‌య‌శాంతి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయ‌న‌ర్‌గా ప్ర‌చార రంగంలోకి దిగారు. తెలంగాణ‌లో ఆమె ప్ర‌చారం చేస్తున్నారు కానీ ఆమెకి ప్ర‌చారం ద‌క్క‌డం లేదు. జ‌న‌ర‌ల్‌గా స్టార్ క్యాంపెయ‌న‌ర్ల ప్ర‌చారానికి మీడియా ఎక్కువ క‌వ‌రేజ్ ఇస్తూ ఉంటుంది. కానీ రాముల‌మ్మ ప్ర‌చారానికి మీడియాలో పెద్ద‌గా చోటు ద‌క్క‌డం లేదు. 

Allu Arjun's uncle to work for Mahakutami

‘ఎన్టీఆర్’లో దుష్ట కాంగీ ఉంటుందా?

తెలుగువారి ఆత్మ గౌరవ నినాదంతో ప్రజల్లోకి వచ్చి ఢిల్లీ పీఠంపై ఉన్న కాంగ్రెస్స్ వెన్నులో వణుకు పుట్టించిన మహా నాయకుడు నందమూరి తారక రామారావు. ఆయన బయోపిక్‌ని రెండు భాగాలుగా తెర‌కెక్కిస్తున్నారు. రెండో భాగం అంతా మహా నాయకుడిగా ఎదిగిన వైనం, తెలుగువారి ఆత్మ గౌరవం నిలిపిన తీరుని చూపిస్తారు అని ముందు నుంచీ ప్రేక్షక లోకమే కాదు చిత్ర సీమ అంతా ఫిక్స్ అయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు ‘ఎన్టీఆర్’ బయో పిక్ మీద ప్రభావం చూపిస్తాయా? ఎన్టీఆర్ తెలుగువారికి విలన్ గా భావించిన కాంగ్రెస్స్ పార్టీని ఈ బయో పిక్ లో ఎలా చూపిస్తారు అనే చర్చ మొదలైంది.

Rumors about Megastar Chiranjeevi surface

బండ్ల గ‌ణేష్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని తిడుతాడా?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ నా దేవుడు అంటూ ఎపుడూ ఊగిపోయే బండ్ల గ‌ణేష్ పాలిటిక్స్‌లోకి వ‌చ్చాడు. స‌హ‌జంగానే బండ్ల గ‌ణేష్ ఎర్ర తువ్వాల త‌న మెళ్లో వేసుకుంటాడ‌నుకుంటారు. కానీ ఆయ‌న కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నాడు. జ‌న‌సేన పార్టీలో చేర‌కుండా, కాంగ్రెస్ తీర్థం పుచ్చ‌కున్నాడు. రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.

అల్లు అర్జున్ మామ చూపు కాంగ్రెస్ వైపు

అల్లు అర్జున్ భార్య స్నేహ తండ్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి టీఆర్ఎస్ నేత‌. అయితే ఇది ఎన్నిక‌ల టైమ్. టికెట్ రాని వారంతా జంపింగ్‌ చేసే కాల‌మిది. బ‌న్ని మామ కూడా తెలంగాణ రాష్ర్ట స‌మితికి హ్యండిచ్చి కాంగ్రెస్ హ‌స్తం అందుకుంటాడ‌నే టాక్ న‌డుస్తోంది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఇబ్ర‌హీం ప‌ట్నం నుంచి తెరాస అభ్య‌ర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయ‌న‌పై గెలిచిన తెలుగుదేశం అభ్య‌ర్థి మంచిరెడ్డి కిష‌న్‌రెడ్డి ఆ త‌ర్వాత బంగారు తెలంగాణ కోసం సైకిల్ వీడి కారు ఎక్కారు. తెరాస‌లోకి మంచిరెడ్డి వ‌చ్చినా.. బ‌న్ని మామ అదే పార్టీలో కొన‌సాగారు.

Pages

Subscribe to RSS - Congress