అల్లు అర్జున్ మామ చూపు కాంగ్రెస్ వైపు

అల్లు అర్జున్ భార్య స్నేహ తండ్రి కె.చంద్రశేఖర్ రెడ్డి టీఆర్ఎస్ నేత. అయితే ఇది ఎన్నికల టైమ్. టికెట్ రాని వారంతా జంపింగ్ చేసే కాలమిది. బన్ని మామ కూడా తెలంగాణ రాష్ర్ట సమితికి హ్యండిచ్చి కాంగ్రెస్ హస్తం అందుకుంటాడనే టాక్ నడుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఇబ్రహీం పట్నం నుంచి తెరాస అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయనపై గెలిచిన తెలుగుదేశం అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆ తర్వాత బంగారు తెలంగాణ కోసం సైకిల్ వీడి కారు ఎక్కారు. తెరాసలోకి మంచిరెడ్డి వచ్చినా.. బన్ని మామ అదే పార్టీలో కొనసాగారు. ఈ సారి తనకి వేరే ఇబ్రహీంపట్నం కాకపోయినా వేరే నియోజకవర్గంలో సీటు ఇస్తారని ఆశపడ్డారు.
ఐతే తెరాస అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకి వెళ్తున్నట్లు ప్రకటించడమే కాదు ఏకంగా 105 మంది తెరాస అభ్యర్థులను ప్రకటించారు. ఆ లిస్ట్‌లో అల్లు అర్జున్ మామ పేరు లేదు. బన్ని మామ సొంత నియోజకవర్గం ఇబ్రహీం పట్నంలో మంచిరెడ్డికే స్థానాన్ని కేటాయించారు కేసీఆర్. ఇక ఆయన ఆశపడుతున్న ఖైరతాబాద్ నియోజకవర్గంకి చాలా పోటీ ఉంది. ఎందరో ఆశపడుతున్నారు ఆ సీటుకి. అది ఆయనకి దక్కే చాన్స్‌లేదు.
దాంతో అల్లు అర్జున్ మామ ఇపుడు కాంగ్రెస్‌తో రాయబేరాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. అంతా సెట్ అయితే ఆయన కారు దిగి రాహుల్‌కి షేక్ హ్యండ్ ఇవ్వొచ్చు అనేది టాక్.
- Log in to post comments