బండ్ల గణేష్ పవన్ కల్యాణ్‌ని తిడుతాడా?

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నా దేవుడు అంటూ ఎపుడూ ఊగిపోయే బండ్ల గణేష్ పాలిటిక్స్‌లోకి వచ్చాడు. సహజంగానే బండ్ల గణేష్ ఎర్ర తువ్వాల తన మెళ్లో వేసుకుంటాడనుకుంటారు. కానీ ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. జనసేన పార్టీలో చేరకుండా, కాంగ్రెస్ తీర్థం పుచ్చకున్నాడు. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.
తనకు కాంగ్రెస్ అంటే ఇష్టమని ఆ పార్టీలో చేరానన్నాడు బండ్ల గణేష్. జూబ్లీహిల్స్ టిక్కెట్ కోరుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్న బండ్ల పార్టీ ఏమి చెపితే అది చేస్తాడట, మరి పవర్‌స్టార్ తన దేవుడు అని ఇన్నాళ్లూ ఊగిపోయారు కదా అంటే అవును ఆయన దేవుడే క కానీ చిన్నప్పట్నుంచీ కాంగ్రెస్‌పై ఉన్న ఇష్టం ఉందని అన్నాడు. అందుకే ఆ పార్టీలో చేరుతున్నా అని చెప్పాడు. ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేయాలన్నది తన కోరికని బండ్ల గణేశ్ అంటున్నాడు.
మరి జనసేన అధినేతని విమర్శిస్తాడా? అంటే నో అని చెపుతున్నాడు. పార్టీలు వేరు అయినా జనసేన అధినేతని పల్లెత్తు మాట అనడట. ఇదోరకం పాలిటిక్స్.
- Log in to post comments