దర్శకుడు క్రిష్ ఇప్పటి వరకు ఎపుడు పెద్దగా సమస్యలను చూడలేదు. తొలి సినిమా గమ్యం నుంచే ఆయన తన సినిమా బతుకు బండిని సుకున్‌గా లాగిస్తున్నాడు. తొలి సినిమాతోనే క్రిటికల్ అప్లాజ్ రావడం, ఆ తర్వాత సక్సెస్‌లు రావడంతో మిడిల్ రేంజ్ దర్శకుల జాబితాలో చేరాడు. ఐతే 2019 మాత్రం ఆయనకి కలిసి రాలేదు.
నేను బంగారంలాంటి సినిమాని తీసి ఇస్తే ...దాన్ని కంగన వెండిగా మార్చిందని క్రిష్ వాపోతున్నారు. "మణికర్ణిక" విడుదల తర్వాత క్రిష్..ముంబై మీడియాకి అదే పనిగా ఇంటర్య్వూలు ఇస్తున్నారు. విడుదలైన సినిమాలో ఇప్పటికి 70 శాతం తనదే అని అంటున్న క్రిష్‌కి కంగన సిస్టర్ రంగోలి ఘాటుగా సమాధానం ఇచ్చింది.
బాబూ సరే ...సినిమా అంతా మీరే తీశారని ఒప్పుకుంటున్నాం. ఇక శాంతించు. కంగన ఫేస్ వల్లే సినిమా ఆడుతుందనేది వాస్తవం కదా. ఆమెని అలా వదిలెయ్యి. ఆమె సక్సెస్‌ని ఎంజాయ్ చేయనివ్వు. ఇక మీ పని మీరు చూసుకొండి, అంటూ ట్వీట్ చేసింది రంగోలి. ఇన్‌డైరక్ట్‌గా భారీ సెటైర్ వేసింది.
కంగన రనౌత్ నటించిన మణికర్ణిక సినిమా విడుదలైంది. ఈ సినిమాకి కొందరు విమర్శకులు మంచి రేటింగ్ ఇచ్చారు. మరికొందరు బ్యాడ్‌గా ఉంది డైరక్షన్ అన్నారు. ఐతే నటిగా మాత్రం ఆమెకి అందరూ డిస్టింక్షన్ మార్కులు ఇచ్చారు. వర్మలాంటి దర్శకులు కూడా ఆమె నటన చూసి గొప్పగా పొగుడుతూ ట్వీట్ చేశారు. ఐతే ఈ సినిమాకి ఆమె దర్శకురాలిగా కూడా పేరు వేసుకొంది. క్రిష్ తీసిన ఈ సినిమాని 70 శాతం రీషూట్ చేశానని రిలీజ్‌కి ముందు కంగనా చెప్పుకొంది. మరి నిజంగా క్రిష్ తీసిన సీన్లు సినిమాలో ఏమీ లేవా?