ఒకపుడు తెగ హంగామా చేసిన ప్రగ్యా జైస్వాల్ ఉన్నట్టుండి టాలీవుడ్ సీన్ నుంచి మాయమైంది. ఆచారి అమెరికా యాత్ర విడుదలకి ముందు నుంచే ప్రగ్యా పెద్దగా కనిపించడం లేదు. అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నట్లు కూడా లేదు.
ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలు క్రిష్‌ని చాలా ఇబ్బందికి గురి చేశాయి. వైవిధ్య చిత్రాల దర్శకుడిగా పేరొందిన క్రిష్‌కి ఆ రెండు సినిమాలు బ్యాడ్‌నేమ్ తెచ్చాయి. కెరియర్‌కే తలమానికం కావాల్సిన ఆ సినిమాలు దారుణంగా పరాజయం పాలు అయ్యాయి. ఇది క్రిష్‌కి పెద్ద షాక్. ఐతే ఆయన కుంగిపోవడం లేదు. వెంటనే మరో సినిమా స్టార్ట్ చేసేందుకు అంతా రెడీ చేసుకుంటున్నారు.
ఎన్టీఆర్ బయోపిక్ స్ర్కిప్ట్‌ని మొదట రూపొందించింది డాక్టర్ ఎల్.శ్రీనాథ్. కుబుసం వంటి సినిమాలు తీసిన దర్శకుడు శ్రీనాథ్...నిర్మాత విష్ణు ఇందూరి ప్రోత్సాహంతో ఎన్టీఆర్ జీవిత కథని స్ర్కిప్ట్‌గా రాశాడు. ఆ కథని దర్శకుడు తేజ కొంత డ్రమటైజ్ చేశారు. అలా మొదలైంది ఎన్టీఆర్ మూవీ.