ఇంకా తేల్చుకోని దర్శకుడు క్రిష్
ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలు క్రిష్‌ని చాలా ఇబ్బందికి గురి చేశాయి. వైవిధ్య చిత్రాల దర్శకుడిగా పేరొందిన క్రిష్‌కి ఆ రెండు సినిమాలు బ్యాడ్‌నేమ్ తెచ్చాయి. కెరియర్‌కే తలమానికం కావాల్సిన ఆ సినిమాలు దారుణంగా పరాజయం పాలు అయ్యాయి. ఇది క్రిష్‌కి పెద్ద షాక్. ఐతే ఆయన కుంగిపోవడం లేదు. వెంటనే మరో సినిమా స్టార్ట్ చేసేందుకు అంతా రెడీ చేసుకుంటున్నారు.
తెలుగులో తనదైన శైలిలో ఒక హృద్యమైన కథతో సినిమా తీయడమా లేక బాలీవుడ్‌లో బడా హీరోతో సినిమా మొదలుపెట్టడమా అనే విషయంలో ఇంకా తేల్చుకోలేదంట. ఈ రెండు ఆప్సన్స్‌లో ఏదీ బెస్ట్ అనేది ఆలోచించి తన తదుపరి చిత్రాన్ని వారంలో అనౌన్స్ చేస్తాడట.
మణికర్ణిక సినిమా అంతా తానే తీసుకున్నానని కంగన రనౌత్ ప్రకటించుకున్నా... క్రిష్ డైరక్షన్ మీదున్న నమ్మకంతో బాలీవుడ్ అగ్రహీరో మరో సినిమా ఆఫర్ ఇచ్చేందుకు ఓకే చెప్పాడట. ఇంతకుముందు అక్షయ్‌తో గబ్బర్ ఈజ్ బ్యాక్ అనే సినిమా తీశాడు క్రిష్. ఐతే అక్షయ్ ఇప్పటికే రెండు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరి క్రిష్ .. మెల్లగా కథ రాసుకొని హిందీ చిత్రం చేస్తాడా? తెలుగులోనే మూవీ తీస్తాడా అనేది తెలియాలంటే మరో వారం, పది రోజులు ఆగాలి.
- Log in to post comments