ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలు క్రిష్‌ని చాలా ఇబ్బందికి గురి చేశాయి. వైవిధ్య చిత్రాల దర్శకుడిగా పేరొందిన క్రిష్‌కి ఆ రెండు సినిమాలు బ్యాడ్‌నేమ్ తెచ్చాయి. కెరియర్‌కే తలమానికం కావాల్సిన ఆ సినిమాలు దారుణంగా పరాజయం పాలు అయ్యాయి. ఇది క్రిష్‌కి పెద్ద షాక్. ఐతే ఆయన కుంగిపోవడం లేదు. వెంటనే మరో సినిమా స్టార్ట్ చేసేందుకు అంతా రెడీ చేసుకుంటున్నారు.
ఎన్టీఆర్‌కి భారతరత్న ఇప్పటి వరకు రాకపోవడానికి ఒక రీజన్ ఉంది. ఎన్టీఆర్‌కి భారతరత్న ఇస్తే ఆ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోవాల్సింది లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ భార్యగా ఆమెకి మాత్రం భారత ప్రభుత్వం నుంచి ఆహ్వానం ఉంటుంది. ఇది ఎన్టీఆర్ కుటుంబ సభ్యులెవ్వరికీ ఇష్టం లేదు. లక్ష్మీపార్వతిని వారు తమ కుటుంబ సభ్యురాలిగా ఎన్టీఆర్ కొడుకులు, కూతుళ్లు గుర్తించడం లేదు.
నందమూరి బాలకృష్ణ మొన్నటి వరకు క్రిష్ ఏది చెపితే అది చేశాడు. తన వందో చిత్రాన్ని సూపర్‌గా సక్సెస్ చేయడంతో బాలయ్యకి క్రిష్ మీద అంత గురి కలిగింది. అందుకే ఎన్టీఆర్ బయోపిక్ బాధ్యతలు అప్పగించాడు బాలయ్య. మొదటి భాగం "ఎన్టీఆర్ కథానాయకుడు" జనవరి 9న విడుదలయింది. జనవరి 9 వరకు బాలయ్య క్రిష్ ఏది చెప్పినా నో చెప్పలేదు. జనవరి 10 నుంచి సీన్ మారింది.