ఎన్టీఆర్ బయోపిక్ గ్రాండ్‌గా రూపొందుతోందనే విషయంలో ఎవరికీ సందేహాలు లేవు. ఇప్పటి వరకు వచ్చిన ఫోటోలు అన్నీ సినిమాపై అంచనాలు పెంచుతున్నవే. ఐతే ప్రతి 15 రోజులకో సారి, 20 రోజులకో సారి ఇలా ఒక్కో అకేషన్‌ని పట్టుకొని ఫోటోలు విడుదల చేస్తుండడం విమర్శలు వస్తున్నాయి. సినిమా షూటింగ్ చేస్తున్నట్లు లేదు..ఫోటోసూట్‌లు చేసి విడుదల చేస్తున్నట్లు ఉందని హార్ష్ కామెంట్‌లు కూడా పడుతున్నాయి.
రానా నిజం చెప్పలేక ఇబ్బంది పడుతున్నాడు. రానా కొంతకాలంగా ఒక వ్యాధితో ఇబ్బందిపడుతున్నాడు. ప్రస్తుతం దానికి చికిత్స జరుగుతోంది. విదేశాల నుంచి వచ్చిన డాక్టర్లు ఇచ్చిన మందులతో ఆయన కోలుకుంటున్నాడు. ఫిజికల్‌గా ఎక్కువగా ఇబ్బంది కలిగించే యాక్షన్ సినిమాల షూటింగ్‌లకి ప్రస్తుతం కామా పెట్టాడు. అందుకే ఎన్టీఆర్ బయోపిక్‌లో నారా చంద్రబాబునాయుడిగా గెస్ట్ రోల్‌లో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఇది ఫిజికల్‌గా ఎటువంటి స్ట్రయిన్ చేయని పాత్ర.
"మణికర్ణిక" సినిమాకి సంబంధించిన షూటింగ్, ప్రొడక్షన్ పనులను దర్శకుడు క్రిష్‌తో సంబంధం లేకుండా కంగనా రనౌత్ చూసుకుంటోందనేది నిజం. తెలుగు సినిమా.కామ్ ఈ న్యూస్‌ని ఇంతకుముందే ప్రచురించింది. "మణికర్ణిక" షూటింగ్‌ని క్రిష్ మ్యాగ్జిమమ్ పూర్తి చేసినా.. కంగనాకి కొన్ని సీన్లు నచ్చలేదు. వాటిని రీషూట్ చేయాలని కోరింది. కానీ అప్పటికే క్రిష్ ..ఎన్టీఆర్ బయోపిక్ ఒప్పుకున్నాడు. దాంతో చేయలేనని అన్నాడు. విచిత్రం ఏమిటంటే.. ఏ దర్శకుడు అయినా ఒక సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయి, సెన్సార్ పూర్తయ్యేవరకు ఆ సినిమాతోనే ఉంటాడు, మరో సినిమా షూటింగ్ ఒప్పుకున్నాను అని వెళ్లకూడదు.