నిజం చెప్పలేక రానా తిప్పలు

రానా నిజం చెప్పలేక ఇబ్బంది పడుతున్నాడు. రానా కొంతకాలంగా ఒక వ్యాధితో ఇబ్బందిపడుతున్నాడు. ప్రస్తుతం దానికి చికిత్స జరుగుతోంది. విదేశాల నుంచి వచ్చిన డాక్టర్లు ఇచ్చిన మందులతో ఆయన కోలుకుంటున్నాడు. ఫిజికల్‌గా ఎక్కువగా ఇబ్బంది కలిగించే యాక్షన్ సినిమాల షూటింగ్‌లకి ప్రస్తుతం కామా పెట్టాడు. అందుకే ఎన్టీఆర్ బయోపిక్‌లో నారా చంద్రబాబునాయుడిగా గెస్ట్ రోల్‌లో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఇది ఫిజికల్‌గా ఎటువంటి స్ట్రయిన్ చేయని పాత్ర.
ఐతే రానా మాత్రం తన హెల్త్ గురించి మీడియా అడుగుతున్న ప్రశ్నలకి నిజం చెప్పలేక తప్పించుకుంటున్నాడు. రానా రీసెంట్‌గా చాలా బరువు తగ్గాడు. ఎంత సన్నగా అయ్యాడంటే.. బాహుబలి సినిమాలో భల్లాలాదేవాని రెండుగా కట్ చేస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్‌లో సన్నబడ్డాడు. దానికి కారణం.. హెల్త్ సమస్యనే. అనారోగ్యం కారణంగా..డైట్‌ని మార్చడంతో పూర్తిగా సన్నబడ్డాడు.
కానీ రానా చెపుతున్న కారణమేంటో తెలుసా? నారా చంద్రబాబు నాయుడు పాత్ర కోసం బరువు తగ్గానని మీడియాకి చెపుతున్నాడు. ఏమాత్రమైనా నమ్మదగ్గ మేటరేనా ఇది? సరే అదే నిజమనుకుందాం? మరి ఇతర సినిమాల షూటింగ్‌లు ఎందుకు ఆపారని అడిగితే.. ఆ సినిమాలకి సంబంధించిన నెక్స్ట్ షూటింగ్ కేరళలలో జరగాలిట. కానీ కేరళలో ఇపుడు వరదలు వచ్చాయి కాబట్టి షూటింగ్ ఆపారని చెపుతున్నాడు. కేరళలో వరదలు వచ్చింది గత వారంలో. రానా ఆ సినిమాల షూటింగ్‌లను ఆపేసి రెండు నెలలు కావొస్తోంది. ఆరోగ్యం గురించి డైరక్ట్‌గా సమాధానం ఇవ్వలేక ఇలా తిప్పలు పడుతున్నాడు.
- Log in to post comments