బాలయ్యకి వీరాభిమాని దర్శకుడు బోయపాటి. బాలయ్యతో "సింహ", "లెజెండ్" చిత్రాలు తీశాడు బోయపాటి. త్వరలోనే మరో సినిమా తీయాలని అనుకుంటున్నాడు. అంత అనుబంధం ఇద్దరి మధ్య ఉంది. ఐనప్పటికీ వీరిద్దరి సినిమాలు ఈ సంక్రాంతికి పోటీ పడుతున్నాయి. బాలయ్య నటించి, నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ జనవరి 9న విడుదల కానుంది.