బోయ‌పాటి వెర్సెస్ బాల‌య్య‌

Boyapati vs balakrishna
Tuesday, November 27, 2018 - 00:15

బాల‌య్య‌కి వీరాభిమాని ద‌ర్శ‌కుడు బోయ‌పాటి. బాల‌య్య‌తో "సింహ‌", "లెజెండ్" చిత్రాలు తీశాడు బోయ‌పాటి. త్వ‌ర‌లోనే మ‌రో సినిమా తీయాల‌ని అనుకుంటున్నాడు. అంత‌ అనుబంధం ఇద్ద‌రి మ‌ధ్య ఉంది. ఐన‌ప్ప‌టికీ వీరిద్ద‌రి సినిమాలు ఈ సంక్రాంతికి పోటీ ప‌డుతున్నాయి. బాల‌య్య నటించి, నిర్మిస్తున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ జ‌న‌వ‌రి 9న విడుద‌ల కానుంది.

"ఎన్టీఆర్ బయోపిక్" విడుద‌లైన రెండు రోజుల‌కే బోయ‌పాటి డైర‌క్ట్ చేస్తున్న "విన‌య విధేయ రామ" ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే రెండు సినిమాల మ‌ధ్య డైర‌క్ట్ ఫైట్‌. కానీ బోయ‌పాటి మాత్రం త‌మ రెండు సినిమాల మ‌ధ్య పోటీ లేద‌నే క‌ల‌ర్ ఇస్తున్నాడు. సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు విడుద‌ల కావ‌డం చాలా కామ‌న్‌, రెండూ హిట్ అవ‌డం అనేది ఈ మ‌ధ్య జ‌రుగుతోంది క‌దా అంటూ వివ‌ర‌ణ ఇస్తున్నాడు. అంతేకాదు, ఎన్టీఆర్ బ‌యోపిక్ ముందు మా సినిమా చిన్న‌ది అని చెపుతున్నాడు. ఆ విధంగా బాల‌య్య గుడ్‌బుక్స్‌లో ఉండేందుకు సింపుల్‌గా అలా తేల్చేశాడు.

ఎన్టీఆర్ బయోపిక్ మొద‌టిభాగం, రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన "విన‌య విధేయ రామ" సినిమాలు ఒకేసారి వ‌స్తున్నా.. దీన్ని బాల‌య్య వెర్సెస్ బోయ‌పాటిగా చూపించొద్ద‌ని మీడియాని కోరుతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు.