బయోపిక్: ఆర్జీవీ పనిమనిషి వెర్సెస్ సోమిరెడ్డి పని మనిషి
ఈ మధ్య రాంగోపాల్ వర్మ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా సంచలనాలు క్రియేట్ చేయడం లేదు. కానీ ఆయన తీసే ప్రతి సినిమా మీడియాకి మంచి వార్తాసరుకు అవుతుంది. వర్మ సినిమా తీసినంత కాలం మీడియాకి హెడ్‌లైన్స్ వెతుక్కోవాల్సిన పని ఉండదు. డిస్కషన్‌కి ఏ టాఫిక్ సెలక్ట్ చేసుకుందామని టీవీ చానెల్స్ తలపట్టుకోవాల్సిన అవసరమూ ఉండదు. కావాల్సినంత మెటిరీయల్ వర్మ అందిస్తాడు.
సీనియర్ ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీస్తానని రామ్ గోపాల్ వర్మ ప్రకటించినప్పటి నుంచి నందమూరి అభిమానుల గుండెలు కొట్టుకుంటున్నాయి. దీనికి తోడు ఈ బయోపిక్ లో స్వయంగా తమ నటసింహం బాలయ్య బాబు నటిస్తాడంటూ వార్తలు రావడంతో అభిమానుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వీళ్ల భయానికి ఒకే ఒక్క కారణం వర్మ.
ఎన్టీఆర్ జీవితాన్ని వెండితెరపైకి తీసుకొస్తానని ప్రకటించాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఎన్టీఆర్ శత్రువులెవరో, నమ్మక ద్రోహులెవరో, కాంట్రవర్సీల వెనకున్న అసలు మేటరేంటో.. ఇలా అన్నీ అశేష తెలుగు ప్రజానీకానికి చూపిస్తాననని తనదైన స్టయిల్ లో చెబుతున్నాడు వర్మ. కానీ వర్మకు అంత దమ్ముందా అనేదే ఇక్కడ మెయిన్ టాపిక్.