బయోపిక్: ఆర్జీవీ పనిమనిషి వెర్సెస్ సోమిరెడ్డి పని మనిషి
బయోపిక్: ఆర్జీవీ పనిమనిషి వెర్సెస్ సోమిరెడ్డి పని మనిషి
ఈ మధ్య రాంగోపాల్ వర్మ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా సంచలనాలు క్రియేట్ చేయడం లేదు. కానీ ఆయన తీసే ప్రతి సినిమా మీడియాకి మంచి వార్తాసరుకు అవుతుంది. వర్మ సినిమా తీసినంత కాలం మీడియాకి హెడ్‌లైన్స్ వెతుక్కోవాల్సిన పని ఉండదు. డిస్కషన్‌కి ఏ టాఫిక్ సెలక్ట్ చేసుకుందామని టీవీ చానెల్స్ తలపట్టుకోవాల్సిన అవసరమూ ఉండదు. కావాల్సినంత మెటిరీయల్ వర్మ అందిస్తాడు.
ఇపుడు ఎన్టీఆర్ జీవిత చరిత్రతో మరోసారి వార్తల్లో నిలిచాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ జీవితంలోని ఒక అధ్యాయాన్ని తెరకెక్కిస్తున్నా అని వర్మ ఇప్పటికే ప్రకటించాడు. ఆ అధ్యాయం ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంటర్ అయిన తర్వాత జరిగిన పరిణామాలే ఆయన స్టోరీ పాయింట్.
ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు కిందా మీదా పడుతున్నారు. ఆర్జీవిని ప్రత్యేకంగా టార్గెట్ చేశారు ఆంధ్రప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వర్మ కోరకున్నది కూడా అదే. ఇదే అదనుగా వర్మ
"ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమాలో నన్ను హీరో గా చేయమని రాంగోపాల్ వర్మ అడగడం సంతోషం నేను హీరోగా చేయాలంటే హీరోయిన్ గా లక్ష్మీ పార్వతిని మార్చాలి," అంటూ సోమిరెడ్డి అనడంతో వర్మ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.
"సార్ మీరు హీరోయిన్ గా లక్ష్మి పార్వతి గారిని వద్దు అని చెప్పినప్పట్నుంచి దీపికా పదుకొనే నుండి మా ఇంట్లో పనిచేసే వారిదాకా అందర్నీ అడిగాను. వాళ్ళ రిప్లైలు వింటే మీరు ఉరేసుకుంటారు. కాబట్టి మానవతా దృక్పథంతో కన్నా మీ భార్య గారి మీద గౌరవంతో వాళ్ళు మీ గురించి వ్యక్తపరిచిన అభిప్రాయాలు అన్నింటిని నా మనసులోనే అతి భద్రంగా దాచిపెడ్తున్నా," అంటూ వర్మ సోమిరెడ్డికి కౌంటర్ ఇచ్చాడు.
దానికి సోమిరెడ్డి మళ్లీ కౌంటర్ ఇచ్చారు. "నీతో చర్చకి వెళ్తారా అని మా ఇంట్లో పనిచేసే పని వాళ్ళ నుంచి అందర్నీ అడిగా. ఎవరూ పనిలేని మీతో చర్చ పెట్టుకొనే స్థాయి మాది కాదని వారు రిప్లయి ఇచ్చారం,"టూ సోమిరెడ్డి కామెంట్ చేశాడు.
ఏతావాతా తేలిందేంటంటే.. ఆర్జీవీ పనోళ్లకి, సోమిరెడ్డి పనోళ్లకి మంచి జ్ఞానం ఉంది.
- Log in to post comments