"లక్ష్మీస్ ఎన్టీఆర్" సినిమా విడుదలని ఆపాలంటూ అప్పీల్ అయిన పిటీషన్‌ని తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. విడుదలని ఆపబోమని, వాక్ స్వేచ్ఛని అడ్డుకోబోమని కోర్టు తేల్చిచెప్పింది. ఐతే కోర్టు సినిమా రిలీజ్‌ని ఆపబోమని మాత్రమే చెప్పింది కానీ సెన్సార్ బోర్డుకి ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. రిలీజ్‌ని అడ్డుకోవడం అనేది ఒక అంశం, సెన్సార్ బోర్డు క్లియర్ చేయడం మరో అంశం. ఈ రెండు వేర్వేరు అంశాలు. సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ వస్తేనే సినిమా విడుదల అవుతుంది.
రాంగోపాల్ వర్మ నెక్స్‌ట్ సినిమా..నాగార్జునతో. ఆ తర్వాత లక్ష్మీపార్వతి కోణంలో ఎన్టీ రామారావు బయోపిక్.
తేజ తదుపరి చిత్రం.. వెంకటేష్‌తో. ఆ తర్వాత ఎన్టీ రామారావు బయోపిక్.
గురుశిష్యులు రాంగోపాల్ వర్మ, తేజ ఇలా పోటాపోటీగా సాగుతున్నారు. ఇద్దరూ ఒకేసారి ఎన్టీఆర్ జీవిత చరిత్రని అనౌన్స్ చేశారు. ఇద్దరూ ఆ సినిమాకి ముందు మరో సినిమా చేస్తామంటున్నారు.
వేదిక మారింది కానీ ఆయన వర్కింగ్ స్టయిల్ మారలేదు. ఇదివరకు రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ద్వారా హంగామా చేసేవాడు. ఇపుడు ఫేస్‌బుక్‌లో. ట్విట్టర్ మీద అలక వహించి ఫేస్‌బుక్‌లోకి వచ్చాడు. రామ్‌గోపాల్ వర్మకిపుడు ఒకే ఒక్క వ్యాపకం: ఎన్టీఆర్ సినిమా గురించి అప్‌డేట్ చేయడం, టీవీ ఛానెల్స్‌లో మాట్లాడడం.
ఎన్టీఆర్ జీవిత చరిత్ర తీస్తున్నట్లు రామ్‌గోపాల్ వర్మ రీసెంట్‌గా ప్రకటించాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే పేరుని కూడా ఫిక్స్ చేశాడు. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంగా ఈ కథ సాగుతుందట.
ఫైర్‌బ్రాండ్ రోజా ఊహాగానాలకి తెరదించింది. వర్మ తీసే "లక్ష్మీస్ ఎన్టీఆర్" సినిమాలో అవకాశం వస్తే నటించేందుకు తాను రెడీ అని ప్రకటించింది. లక్ష్మీపార్వతి కోణంలో ఎన్టీఆర్ జీవితాన్ని వర్మ తీస్తానని అనౌన్స్ చేశాడు. ఎన్టీఆర్ పాత్రలో ప్రకాష్‌రాజ్ అనీ, లక్ష్మీపార్వతిగా రోజా అని వార్తలు వచ్చాయి. ఆ వెంటనే వర్మ అదంతా తూఛ్ అనేశాడు.