చాన్స్ ఇస్తే నేను రెడీ: రోజా

Actress Roja says she will not hesitate playing Lakshmi Parvathi
Friday, October 13, 2017 - 16:45

ఫైర్‌బ్రాండ్ రోజా ఊహాగానాలకి తెర‌దించింది. వ‌ర్మ తీసే "ల‌క్ష్మీస్ ఎన్టీఆర్" సినిమాలో అవ‌కాశం వ‌స్తే న‌టించేందుకు తాను రెడీ అని ప్ర‌క‌టించింది. ల‌క్ష్మీపార్వ‌తి కోణంలో ఎన్టీఆర్ జీవితాన్ని వ‌ర్మ తీస్తాన‌ని అనౌన్స్ చేశాడు. ఎన్టీఆర్ పాత్ర‌లో ప్ర‌కాష్‌రాజ్ అనీ, ల‌క్ష్మీపార్వ‌తిగా రోజా అని వార్త‌లు వ‌చ్చాయి. ఆ వెంట‌నే వ‌ర్మ అదంతా తూఛ్ అనేశాడు.

ఇపుడు రోజా స్పందించింది.

"రాంగోపాల్ వర్మ తీసే సినిమాలో  లక్ష్మిపార్వతి పాత్రలో నటిస్తున్నాని ప్రజలు అనుకోవడంలో తప్పులేదు. అది వారి అభిమానుం. 150 సినిమాల్లో నటించిన తనను ప్రేక్షకులు అభిమానంతో ఊహించుకుంటారు. అందులో కాద‌నేదానికి ఏముంది. ఇంతవరకూ రాంగోపాల్ వర్మ న‌న్ను సంప్రదించలేదు. కానీ అపుడే మీడియా రాసేసింది. ఐతే మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ జీవితం ఆధారంగా రూపొందుతోన్న సినిమాలో నటించే విషయంలో ఆలోచిస్తా....", ఇలా కుండ‌బ‌ద్ద‌లు కొట్టినట్లు స్టేట్‌మెంట్ ఇచ్చింది.

వ‌ర్మ చాన్స్ ఇస్తే నేను రెడీ అని ఆమె తిరిగి బాల్‌ని వ‌ర్మ కోర్టులోకి నెట్టింది. అంతేకాదు, ప్రస్తుతం తాను ఏ సినిమాలోనూ నటించడం లేదు పేర్కొంది.