'ఎన్టీఆర్ ఆత్మ నాతో స్క్రీన్‌ప్లే రాయిస్తోంది'

RGV says the spirit of NTR is making him write screenplay
Tuesday, October 17, 2017 - 11:15

వేదిక మారింది కానీ ఆయ‌న వ‌ర్కింగ్ స్ట‌యిల్ మార‌లేదు. ఇదివ‌ర‌కు రాంగోపాల్ వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ ద్వారా హంగామా చేసేవాడు.  ఇపుడు ఫేస్‌బుక్‌లో. ట్విట్ట‌ర్ మీద అల‌క వ‌హించి ఫేస్‌బుక్‌లోకి వ‌చ్చాడు. రామ్‌గోపాల్ వ‌ర్మకిపుడు ఒకే ఒక్క వ్యాప‌కం: ఎన్టీఆర్ సినిమా గురించి అప్‌డేట్ చేయ‌డం, టీవీ ఛానెల్స్‌లో మాట్లాడ‌డం. 

ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర తీస్తున్నట్లు  రామ్‌గోపాల్ వ‌ర్మ రీసెంట్‌గా ప్ర‌క‌టించాడు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అనే పేరుని కూడా ఫిక్స్ చేశాడు. ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితంలోకి వ‌చ్చిన త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంగా ఈ క‌థ సాగుతుంద‌ట‌.

ప్ర‌తిరోజు ఏదో ఒక పోస్ట్ పెడుతున్న వ‌ర్మ తాజాగా ఎన్టీఆర్ ఆత్మ త‌న క‌ల‌లోకి వ‌చ్చి ఈ సినిమా స్క్రిప్ట్ రాయిస్తోంద‌ని వ్యాఖ్యానించాడు. తెలుగుదేశం పార్టీ నేత‌లు, నంద‌మూరి అభిమానులు వ‌ర్మ‌కి వ్య‌తిరేకంగా ఎన్ని కామెంట్‌లు చేసినా, వ‌ర్మ త‌గ్గ‌డం లేదు. ఇంకా వారిని రెచ్చ‌గొట్టేలా చేస్తున్నారు.

వ‌ర్మ తాజా పోస్ట్ ఇది - " లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమా తీయడానికి నాకు అపారమయిన బలమిస్తున్న కేవలం ఒకే ఒక శక్తి ఎవరంటే అది NTR అనే వ్యక్తి.. ఆ మహానుభావుడి ఆత్మ రోజూ నా కలలోకి వచ్చి నాకు స్క్రీన్ ప్లే రాయడానికి సహకరిస్తోంది."