తనపై వరుసగా వీడియో కామెంట్లతో కలకలం రేపుతోన్న నాగబాబుపై స్పందించేందుకు బాలయ్య నిరాకరించారు. నాగబాబు కామెంట్స్‌పై మీ స్పందన ఏంటని తిరుపతిలో మీడియా ప్రశ్నించగా నో కామెంట్ అని ముక్తసరిగా సమాధానం ఇచ్చారు.
విద్యాబాలన్, సుమంత్, సాయి కొర్రపాటిలతో కలిసి బాలయ్య ఈ రోజు తిరుమల తిరుపతి వచ్చారు. స్వామివారి సేవలో పాల్గొన్నారు ‘యన్‌టిఆర్ కథానాయకుడు’ చిత్రం బుధవారం విడుదలవుతున్న కారణంగా స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చామని.. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు బాలకృష్ణ తెలిపారు.