క్రిష్ దే ఫైనల్ ఛాయిస్!

ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో దర్శకుడు క్రిష్ మాట చెల్లడం లేదనీ, కేవలం సెట్‌లో డైరక్షన్ వరకే పరిమితమనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మిగతా అంతా నందమూరి బాలకృష్ణదే నిర్ణయమనే టాక్ నడుస్తోంది. ఐతే ఇది పూర్తిగా నిజం కాదంటున్నాయి ఎన్టీఆర్ బయోపిక్ వర్గాలు.
స్క్రిప్ట్ మొత్తం బాలయ్య ఆలోచన ప్రకారమే రెడీ అయిందనడంలో సందేహం లేదు. స్ర్కిప్ట్ విషయంలో చిన్న చిన్న మార్పులు చేయడం మినహా క్రిష్ అందులో పెద్దగా కలగ చేసుకోలేదు, చేయనివ్వలేదు. ఐతే ఈ సినిమాలో ఉన్న అనేక పాత్రలకి ఎవరినీ తీసుకోవాలనే విషయంలో క్రిష్ ఆలోచనలకే బాలయ్య మద్తతు పలుకుతున్నారు. క్యాస్టింగ్ విషయంలో మ్యాగ్జిమమ్ క్రిష్‌దే ఫైనల్ చాయిస్.
జూనియర్ ఎన్టీఆర్‌కి ఈ సినిమాలో నటించే అవకాశం ఉండదు. క్రిష్‌కి బాలయ్య మనసు తెలుసు కాబట్టి ఆ ప్రస్తావనే తీసుకురావడం లేదు. సో.. క్రిష్ క్యాస్టింగ్ విషయంలో బాలకృష్ణకి పేచీ లేదు. అలాగే తన కుమారుడు మోక్షజ్ఞని ఇందులో నటింపచేయాలా వద్దా అనే నిర్ణయాన్ని కూడా క్రిష్‌కే వదిలేశాడట బాలయ్య. మోక్షజ్ఞ ఇప్పటికే క్రిష్ వద్ద అసిస్టెంట్ డైరక్టర్‌గా వర్క్ చేశాడు. అయితే అతను స్లిమ్‌గా మారితేనే ఇందులో పరిచయం చేద్దామనుకుంటున్నారు. ప్రస్తుతం మోక్షజ్ఞ ఆ పనిలో ఉన్నాడు.
ఐతే నవంబర్‌లోపు మోక్షజ్ఞ స్లిమ్‌గా మారుతాడా అనేది చూడాలి. దాన్ని బట్టి అతన్ని పరిచయం చేయాలా వద్ద అనేది క్రిష్ నిర్ణయిస్తాడట.
- Log in to post comments