ఆమె వల్లే భారతరత్న రావట్లేదట
Submitted by tc editor on Tue, 2019-02-12 15:15
Why NTR is not getting Bharat Ratna?
Tuesday, February 12, 2019 - 15:15
ఎన్టీఆర్‌కి భారతరత్న ఇప్పటి వరకు రాకపోవడానికి ఒక రీజన్ ఉంది. ఎన్టీఆర్‌కి భారతరత్న ఇస్తే ఆ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోవాల్సింది లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ భార్యగా ఆమెకి మాత్రం భారత ప్రభుత్వం నుంచి ఆహ్వానం ఉంటుంది. ఇది ఎన్టీఆర్ కుటుంబ సభ్యులెవ్వరికీ ఇష్టం లేదు. లక్ష్మీపార్వతిని వారు తమ కుటుంబ సభ్యురాలిగా ఎన్టీఆర్ కొడుకులు, కూతుళ్లు గుర్తించడం లేదు.
ఈ కారణంగానే ఎన్టీఆర్‌కి భారతరత్న ఇవ్వకూడదని చంద్రబాబునాయుడు అనధికారికంగా భారతప్రభుత్వానికి చెప్పాడట. ఈ విషయాన్ని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చెపుతున్నారు. ఎన్టీఆర్‌కి ఇప్పటి వరకు భారతరత్న రాకపోవడానికి అసలు కారణం ఇదే అనేది ఆయన వాదన. ఇందులో నిజమెంతో ?
- Log in to post comments