క్రిష్‌కిది పెద్ద పరీక్షే
దర్శకుడు క్రిష్ ఇప్పటి వరకు ఎపుడు పెద్దగా సమస్యలను చూడలేదు. తొలి సినిమా గమ్యం నుంచే ఆయన తన సినిమా బతుకు బండిని సుకున్‌గా లాగిస్తున్నాడు. తొలి సినిమాతోనే క్రిటికల్ అప్లాజ్ రావడం, ఆ తర్వాత సక్సెస్‌లు రావడంతో మిడిల్ రేంజ్ దర్శకుల జాబితాలో చేరాడు. ఐతే 2019 మాత్రం ఆయనకి కలిసి రాలేదు. సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా విడుదలై అట్టర్ ఫ్లాప్ కావడం, మరోవైపు తను 90 శాతం తీసి వదిలేసిన హిందీ సినిమాని కంగనా రీషూట్ చేయడం, ఆ సినిమా క్రెడిట్స్ విషయంలో క్రిష్ బాలీవుడ్ మీడియాకి ఎక్కడం, దానికి కౌంటర్‌గా కంగనా ఘాటుగా స్పందించడం వంటి విషయాలు క్రిష్‌కి కొంత ఇబ్బందికి గురి చేశాయి.
"మణికర్ణిక"కి సంబంధించి పేరు అంతా కంగన కొట్టేసింది. ఇక్కడ చూస్తేనేమో.. "కథానాయకుడు" ఆల్‌టైమ్ అతి పెద్ద డిజాస్టర్స్‌గా నిలిచింది. ఇక మహానాయకుడు సినిమా విషయంలో క్రిష్‌కి లాభం ఏమీ కనిపించడం లేదు. ఐతే.. ఈ రెండో పార్ట్‌నైనా ఎలాగోలా సేఫ్‌గా వదిలితే.. కొంత పరువు దక్కుతుంది. ఇది నిజంగానే క్రిష్‌కి పరీక్షాకాలం.
దర్శకుడిగా తన ప్రతిభని అనేక సినిమాల్లో చూపించాడు క్రిష్. కానీ ఈ సారి ఊహించని కష్టాలు, వివాదాలు క్రిష్‌ని డిఫెన్స్‌లో పడేశాయి.
- Log in to post comments