కేవీ రెడ్డి అద్భుత కళాసృష్టి...మాయాబజార్. ఇన్ని దశాబ్దాలు గడిచినా.. ఈ చిత్రరాజం వన్నె తరగలేదు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఆల్‌టైమ్ గ్రేట్ క్లాసిక్‌గా మిగిలింది. ఈ సినిమాని ఇపుడు మళ్లీ తీశారు, పునఃసృష్టించారు. మొత్తంగా తీయలేదు కానీ మాయాబజార్‌లోని కీలక సన్నివేశాన్ని రిక్రియేట్ చేశాడు దర్శకుడు నాగ అశ్విన్.
సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న 'మహానటి' సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటున్న విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. హైదరాబాద్ గండిపేట పరిసర ప్రాంతాల్లో సెకెండ్ షెడ్యూల్ మొదలైంది. ఈ షెడ్యూల్ లోకి సావిత్రి భర్త క్యారెక్టర్ కూడా ఎంటరైంది.
‘మహానటి’ పేరుతో సావిత్రి జీవితగాథని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. సావిత్రిగా కీర్తి సురేష్ నటిస్తోంది. సమంత కీలక పాత్రల్లో నటిస్తోంది. వీరిద్దరితో పాటు ఇందులో అనుష్క కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అలనాటి నటి జమున పాత్రలో ఆమె నటించనుందట.
జమున పాత్రకు అనుష్క సరిగ్గా సరిపోతుందని చిత్రబృందం భావిస్తోంది. జూన్‌లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కాబోతోంది. అశ్వనీదత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.