సావిత్రి, జెమినీ గణేశన్ కలిశారు

Dulquer Salmaan and Keerthy Suresh as Gemini Ganeshan and Savitri
Thursday, June 22, 2017 - 20:45

సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న 'మహానటి' సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటున్న విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. హైదరాబాద్ గండిపేట పరిసర ప్రాంతాల్లో సెకెండ్ షెడ్యూల్ మొదలైంది. ఈ షెడ్యూల్ లోకి సావిత్రి భర్త క్యారెక్టర్ కూడా ఎంటరైంది.

సినిమాలో సావిత్రి పాత్రను కీర్తిసురేష్ పోషిస్తోంది. సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రను మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ పోషిస్తున్నాడు. ఈ రోజు నుంచి దుల్కర్ సెట్స్ పైకి వచ్చాడు. సావిత్రి-జెమినీ గణేశన్ మధ్య పరిచయం ఎలా ఏర్పడింది, వాళ్ల మధ్య ప్రేమ ఎలా చిగురించింది అనే కాన్సెప్ట్ తో కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించారు.

తాజా షెడ్యూల్ తో మహానటి ప్రాజెక్టుకు సంబంధించి జెమినీ గణేశన్ క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. మొదటి షెడ్యూల్ లో మహానటి సినిమాకు సంబంధించి పిక్స్ లీక్ అవ్వడంతో, సెకెండ్ షెడ్యూల్ నుంచి యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంది. యూనిట్ సభ్యులెవర్నీ మొబైల్స్ తో లొకేషన్ కు అనుమతించడం లేదు. స్వప్న సినిమా బ్యానర్ పై అశ్వనీదత్ కుమార్తె స్వప్న దత్.. మహానటి సినిమాను నిర్మిస్తున్నారు.